close
Choose your channels

గ‌బ్బ‌ర్‌సింగ్ గ్యాంగ్‌తో 'వాల్మీకి'

Tuesday, February 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గ‌బ్బ‌ర్‌సింగ్ గ్యాంగ్‌తో వాల్మీకి

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `జిగ‌ర్ తండా` చిత్రాన్ని తెలుగులో `వాల్మీకి` పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో బాబీ సింహ పాత్ర‌ను తెలుగులో వ‌రుణ్‌తేజ్ చేస్తున్నాడు. సిద్ధార్థ్ పాత్ర‌ను శ్రీవిష్ణు చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. రీసెంట్‌గా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్ర‌వ‌రి 21 నుండి జ‌రుగ‌నుంది. హైద‌రాబాద్‌లో వారంపాటు జ‌ర‌గ‌బోయే ఈ షెడ్యూల్‌లో సినిమాలో ప్ర‌ధాన తారాగ‌ణ‌మైన వ‌రుణ్‌తేజ్‌, త‌నికెళ్ల‌భ‌రణి, గబ్బ‌ర్‌సింగ్ గ్యాంగ్‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. సినిమాలో హీరోయిన్ విష‌యంలో కూడా యూనిట్ ఓ క్లారిటీకి రాలేదు. త్వ‌ర‌లోనే హీరోయిన్ ఎవ‌ర‌నేది కూడా తెలియ‌నుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.