'వనవాసం' అక్టోబర్ 25న విడుదల

  • IndiaGlitz, [Saturday,October 12 2019]

నవీన్ రాజ్ శంకరాపు , శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి, హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్న చిత్రం వనవాసం. భరత్ కుమార్.పి నరేంద్ర దర్శకత్వం లో శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ నెం: 1 సంజయ్ కుమార్. బీ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అక్టోబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ “భారత్ కుమార్ .పి” మాట్లాడుతూ.. కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ని తీయడం జరిగింది. ఈ ట్రైలర్ లాగానే సినిమా కూడా మీ అందరూ మెచ్చే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాను అని అన్నారు.

నిర్మాత సంజయ్ కుమార్ . బీ మాట్లాడుతూ.. సినిమా మేము అనుకున్న దానికంటే చాల అద్భుతంగా తెరకు ఏకించారు అక్టోబర్ 25న ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధం గా ఉన్నాం అని నిర్మాత సంజయ్ కుమార్. బీ చెప్పారు.

హీరో నవీన్ రాజ్ శంకరాపు మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ గారికి ఎపటికి రుణపడి ఉంటాన్ను ఇంకా మా కోసం కష్టపడిన మా టీం అందరి కోసం అయినా మంచి ఫలితం వస్తుంది అని నముతున్న మా ఈ ప్రయత్నాని మీరంతా చూసి మమ్మలిని ఆశీర్వదిస్తారు. అక్టోబర్ 25న మీ ముందుకు వస్తున్న మా వనవాసం టీం కి మీ అందరి ఆశిర్వధం కావాలి అని అన్నారు.