వాన విల్లు ట్రైలర్ లాంచ్

  • IndiaGlitz, [Thursday,November 02 2017]

రాహుల్ ప్రేమ్( ఆర్ పి) మూవీ మేకర్స్ బ్యానర్ పై లంక ప్రతీక్ ప్రేమ్ కరణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వానవిల్లు. ఈ చిత్రానికి నిర్మాత లంక కరుణాకర్ దాస్ కాగా శ్రావ్య రావు, విశాఖ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇదువరకె విడుదలైన వానవిల్లు టీజర్ ప్రేక్షాదరణ పొందింది. ప్రస్తుతం వానవిల్లు ట్రైలర్ ను బుధవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో నటుడు కాశినాథ్ చే విడుదల చేయించారు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, డైరెక్టర్ చిన్ని కృష్ణ, నటి అనిత చౌదరి, నవీన్, జబర్దస్త్ ఫణి, భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సంధర్బంగా

ఈ చిత్ర నిర్మాత లంకా కరుణాకర్ మాట్లాడుతూ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని ఈ నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎన్ హెచ్ 7 సినిమా తరువత నా తనయుడు ప్రతీక్ చేస్తున్న చిత్రం ఇది. తనకున్న టాలెంట్, ఇంట్రెస్ట్ లను గుర్తించి కమర్షియల్ ఎల్మినెంట్స్ తో సమాజానికి ఉపయోగ పడేలా ఒక సినిమా చేయాలను కొని చేస్తున్న చిత్ర మిది. తన మనసులో ఏదైతే ఉందొ దాన్ని ఇంప్లిమెంట్ చేసాడో అదే ఈ వానవిల్లు. ఫ్యామిలీ, యూత్, సమాజానికి ఇలా ఎవరికి ఏం కావాలో అన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. తప్పకుండా ఆదరిస్తారని భావిస్తున్నా అన్నారు.

సంగీత దర్శకుడు ప్రభు మాట్లాడుతూ నా మాటపై గౌరవం ఉంచి ఇక్కడకు వచ్చిన సాయి కార్తీక్ కు నా కృతఙ్ఞతలు. నా తమ్ముడు ప్రతీక్ చాలా కష్టపడి మంచి అవగాహన తో సినిమా చేశాడు. ఒక పెద్ద డైరెక్టర్లకు ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ తనకుంది. నిర్మాత మా బాబాయి కరుణాకర్ ఖర్చుకు వెనకాడకుండా నేను ఏది అడిగితే అది ఇచ్చి ప్రోత్సహించారు అని అన్నారు.

కాశినాథ్ మాట్లాడుతూ మాస్ ఎంటర్త్సైన్మెంట్స్ అన్నీ ఈ వానవిల్లు లో ఉన్నాయి. చాలా క్లారిటీ గా సీన్స్ ను ఫినిష్ చేసాడు దర్శకుడు ప్రతీక్. తమిళ దర్శకుడు సుందద్ రాజేంద్రన్ క్వాలిటీస్ తనలో కనపడుతున్నాయి. తప్పకుండా విజయం సాధిస్తుందని భావిస్తున్నా అన్నారు. క్లాస్ టైటిల్ లో, మాస్ ట్రైలర్లో కనపడుతోంది. చాలా బాగుంది. అన్నీ ఒకతనే చేయడం చాలా కష్టం. ప్రతీక్ ఈ సాహసం వెనుక ఇతని తండ్రే అతని ధైర్యం అయ్యుంటుందని, సినిమా బాగా ఆడి అందరికీ మంచి పేరు రావాలని ఆశిస్తున్నామంటూ దర్శకుడు చిన్ని కృష్ణ, మరియు సాయి కార్తీక్ తెలిపారు.

చివరిగా హీరో మరియు దర్శకుడు ప్రతీక్ లంకా మాట్లాడుతూ ఒక సినిమా చేయాలంటే ముఖ్యంగా 4 స్థంబాలాంటి వారు ఆ నాలుగు స్తంభాలు నాకు ఉండటంతోనే ఈ సినిమాను చేయగలిగాను. 200 మంది రెండున్నర సంవత్సరాలుగా పడిన కష్టమే ఈ వానవిల్లు సినిమా. ప్రేక్షకులకు నచ్చే వరకు సినిమాలు చేస్తూనే ఉంటా, నవంబర్ లో విడుదలవనుంది. కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నా, నాకు సపోర్ట్ చేసినవారందరికీ నా కృతఙ్ఞతలు తెలుపు తున్నా అన్నారు.

లంక ప్రతీక్ ప్రేమ్ కరణ్, శ్రావ్య, విశాఖ, కాశినాథ్, అనిత చౌదరి, హేమ, ప్రవీణ్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రభు ప్రవీణ్, సినిమాటోగ్రఫీ: ఎస్ డి. జాన్, కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, వేణు మాస్టర్, ఫైట్స్: నందు మాస్టర్, నిర్మాత: లంక కరుణాకరణ్ దాస్, కథ-స్క్రీన్ ప్లే- ఎడిటింగ్-డైరెక్షన్: లంక ప్రతీక్ ప్రేమ్ కరుణా కరన్.

More News

అక్ర‌మ్ మూవీ టీజర్ రిలీజ్ ఫంక్ష‌న్

విజ‌య‌వాడ‌: న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి అచ్చ తెలుగు నేల‌పై... హాలీవుడ్ త‌ర‌హాలో నిర్మిoచబడిన  సినిమా "అక్ర‌మ్". ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ ఫంక్ష‌న్ విజ‌య‌వాడ‌లోని ఒక స్టార్ హోట‌ల్ లో ఘ‌నంగా జ‌రిగింది.

సోలోకి ఒక్క రోజు ముందు..

ఆరేళ్ల క్రితం విడుద‌లైన సోలో చిత్రం మంచి విజ‌యం సాధించింది. నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ అందించిన సంగీతం బాగా ప్ల‌స్ అయ్యింది. నవంబ‌ర్ 25, 2011న సోలో విడుద‌లైంది.

బెల్లంకొండ కూడా అదే రోజున‌..

చూస్తుంటే.. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 9 సినిమా ప్రియుల‌కు వినోదానికి చిరునామాలా మారేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ రోజున రెండు సినిమాలు రాబోతున్నాయంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

చై, సామ్ రిసెప్ష‌న్‌...

చైత‌న్య అక్కినేని, హీరోయిన్ స‌మంత‌లు అక్టోబ‌ర్ నెల‌లో ఓ ఇంటివారైన సంగ‌తి తెలిసిందే. గోవాలో ప‌రిమితంగా కుటుంబ స‌భ్యులు, శ్రేయోభిలాషుల స‌మ‌క్షంలో వీరి పెళ్లి హిందూ, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో జ‌రిగింది.

నాగ‌శౌర్య‌.. ముగ్గురు కొత్త ద‌ర్శ‌కులు

ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో ఆక‌ట్టుకున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌ శౌర్య‌. ఆ త‌రువాత జో అచ్యుతానంద‌లాంటి చిత్రాల‌తో త‌న ఉనికిని చాటుకున్న ఈ యంగ్ హీరో.. ప్ర‌స్తుతం చేతిలో ఐదు సినిమాలతో బిజీగా ఉన్నాడు.