నిర్మాణాంతర కార్యక్రమాలలో వర్మ vs శర్మ

  • IndiaGlitz, [Thursday,April 07 2016]
మాస్టర్ చంద్రాంషువు నార్ని సమర్పణలో పాలిన్ డ్రోమ్ పిక్చర్స్ పతాకం పై గిరిబాబు, జూ.రేలంగి టైటిల్ రోల్ లో బాబ్ రతన్, బిందు బార్బీ జంటగా నటిస్తున్న చిత్రం 'వర్మ vs శర్మ'. ఇటీవలే చివరి షెడ్యూల్ పూర్తిచేసుకుని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఉగాది సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.
దర్శకుడు భువన విజయ్ మాట్లాడుతూ... ఈ చిత్రం పూర్తిగా గోదావరి జిల్లాలలో ఆహ్లాదకర లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుందని.. హాస్య ప్రధానంగా మూఢ నమ్మకాలపై రూపొందిన ఈ చిత్రం గోపాలా..గోపాల, పీకె, తరహాలో కామెడీ సెటైర్ గా ఉంటుందని అన్నారు.
వర్మ పాత్రలో గిరిబాబు, శర్మ పాత్రలో రేలంగి తగినంత హాస్యాన్ని పండించారని.. హీరో తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ప్రయత్నించిన విధానం అందరినీ నవ్విస్తూనే, చివర్లో థ్రిల్ గురి చేస్తుందని అన్నారు. రమణ రాథోడ్ సంగీతం ఈ చిత్రాన్ని మరో మెట్టుకు తీసుకెళ్తుందని తెలిపారు.
నిర్మాత ఫణి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని..ఈ చిత్రం నుండి 100% హ్యూమర్ ఆశించవచ్చని, త్వరలో ఆడియో విడుదల చేస్తామని తెలిపారు.
దీక్షితులు,రమణ,అడ్డకర్ల,బాబులు,ఉదయబాబు,తిరుపతి రావు,అజయ్, శ్రీరామ్,వాసు,బుల్లబ్బాయి, భారతి, లలిత, లక్ష్మి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:రమణ రాథోడ్, కెమెరా: రంగా, ఎడిటింగ్: ప్రభు, పాటలు: రమణ, కొరియోగ్రఫీ: ఆనంద్, ఆర్ట్: హరి, నిర్మాత: ఫణి దుర్గ ప్రసాద్(చినబాబు) నార్ని, రచన-దర్శకత్వం: భువన విజయ్

More News

'సిద్ధార్ధ' చిత్రీకరణ పూర్తి

'జీనియస్','రామ్ లీల' చిత్రాల ద్వారా రామదూత క్రియేషన్స్ కి ఓ బేనర్ వేల్యూ తెచ్చుకోగలిగారు నిర్మాత దాసరి కిరణ్ కుమార్.

మ‌హేష్..చెప్పులు తొడుగుతుంది అత‌నికే..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నారు. కొత్త సంవ‌త్స‌ర కానుక‌గా జ‌న‌వ‌రి 1న బ్ర‌హ్మోత్స‌వం టీజ‌ర్ రిలీజ్ చేసారు.

స‌రైనోడు సెన్సార్ టాక్..

స్లైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కించారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు.

సర్దార్ సరికొత్త ట్రెండ్...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డులకు తెర తీస్తుంది.

జగన్ పార్టీలో మోహన్ బాబు..?

విలక్షణ నటుడు మోహన్ బాబు...మళ్లీ రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్నారు.ప్రెస్ మీట్ పెట్టి మరీ...నేను మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నాను అని ప్రకటించేసారు.