close
Choose your channels

లవ్, హర్రర్ తో సర్ ప్రైజ్ చేసిన వరుణ్ సందేశ్ 'ఇందువదన' టీజర్

Wednesday, August 4, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లవ్, హర్రర్ తో సర్ ప్రైజ్ చేసిన వరుణ్ సందేశ్ ఇందువదన టీజర్

హీరో వరుణ్ సందేశ్ చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్, కొత్తబంగారు లోకం లాంటి చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ వరుణ్ సందేశ్ తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా చేస్తున్న చిత్రం ఇందువదన. ఇందులో లవ్, రొమాన్స్ ఉన్నప్పటికీ పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

లవ్, హర్రర్ తో సర్ ప్రైజ్ చేసిన వరుణ్ సందేశ్ ఇందువదన టీజర్

ఈ మూవీలో వరుణ్ సందేశ్ డిఫెరెంట్ గెటప్ లో కనిపిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. అటవీ నేపథ్యంలో సాగే ఎమోషనల్ లవ్ స్టోరీ ఈ చిత్రం. టీజర్ లో వరుణ్ సందేశ్, హీరోయిన్ ఫెర్నాజ్ శెట్టి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపించింది.

లవ్, హర్రర్ తో సర్ ప్రైజ్ చేసిన వరుణ్ సందేశ్ ఇందువదన టీజర్

కానీ టీజర్ చివర్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ చిత్రంలో హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. హర్రర్ అంశాలని కామెడీతో మిళితం చేసి చూపించారు. ఇక వరుణ్ సందేశ్, ఫెర్నాజ్ మధ్య బోల్డ్ రొమాన్స్ సన్నివేశాలు కూడా ఉన్నట్లు టీజర్ బట్టి అర్థం అవుతోంది. టీజర్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది.

లవ్, హర్రర్ తో సర్ ప్రైజ్ చేసిన వరుణ్ సందేశ్ ఇందువదన టీజర్

ఫెర్నాజ్ బ్లౌజ్ లేకుండా శారీలో కనిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఎంఎస్ఆర్ ఈ చిత్రానికి దర్శకుడు. మరి వరుణ్ సందేశ్ చేస్తున్న ఈ విభిన్న ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి. వరుణ్ సందేశ్ బిగ్ బాస్ 3లో తన సతీమణి వితిక కలసి కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. బిగ్ బాస్ లో వరుణ్ 3 వ స్థానంలో నిలిచాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.