'పిచ్చోడు' ఆడియోను విడుదల చేసిన వరుణ్ సందేశ్, వితిక

  • IndiaGlitz, [Tuesday,November 19 2019]

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా పిచ్చోడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయ్యింది. ఫస్ట్ లుక్ కు సోషల్ మీడియాలో మరియు బయట మంచి రెస్పాన్స్ లభిస్తోంది. క్రాంతి, కె.సీమర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, సమీర్, సత్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ మూవీ నవంవర్ 22న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఆడియోను వరుణ్ సందేశ్, వితిక విడుదల చేశారు.

ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. హీరో క్రాంతికి ఈ సినిమాతో మంచి పేరు తెచ్చిపెట్టె అవకాశాలు ఉన్నాయని వరుణ్ సందేశ్ తెలిపాడు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్త్సైన్మెంట్ చిత్రాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయని, ఈ మూవీలో నటించిన నటీనటులందరికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

నటీనటులు: క్రాంతి, కె.సీమర్, పోసాని కృష్ణమురళి, సమీర్, సత్య కృష్ణ, అభయ్, అప్పారావు, మహేష్, దుర్గ.

More News

'తొలుబొమ్మలాట' సినిమాతో మళ్ళీ మీ గుండెల్లో నేను ఉండిపోతాను - డా.రాజేంద్రప్రసాద్

డా. రాజేంద్రప్రసాద్‌, విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా, శ్రీనివాస్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'తోలుబొమ్మలాట'.

మనల్ని మనం ప్రశ్నించుకునే చిత్రం "ప్రతిరోజు పండగే" - హీరో సాయితేజ్

సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా... మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా...

లింగమనేని ప్రాజెక్ట్స్ దివాలా వార్తలపై రమేష్ క్లారిటీ

లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్ఈపీఎల్) కంపెనీ దివాలా తీసినట్లు వస్తున్న వార్తలపై ఎల్ఈపీఎల్ కంపెనీ అధినేత లింగమనేని రమేష్ స్పష్టతనిచ్చారు.

సుమంత్ చిత్రానికి 'క‌ప‌ట‌ధారి' టైటిల్ ఖ‌రారు

హీరో సుమంత్, ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రానికి `క‌ప‌ట‌ధారి` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

‘పవన్.. చేగువేరాను మర్చిపోయి.. కాసినోవాలా!’

రాజకీయాల్లో కూడా పవన్‌వి అనైతిక బంధాలని, ప్రశ్నించేతత్వాన్ని ఆయన మరిచిపోయారని వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌ పేర్కొన్నారు.