కొందరు యోధులు తయారవుతారు.. కానీ ‘‘గనీ’’ యోధుడిగా పుట్టాడు

  • IndiaGlitz, [Wednesday,January 19 2022]

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. లవ్ స్టోరీలతో తనకు తిరుగులేదని నిరూపించుకున్న ఆయన.. యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు తాపత్రయపడుతున్నారు. తాజాగా వరుణ్ తేజ్ నటిస్తోన్న సినిమా ‘‘గని’’. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘‘గని’’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మూడు పాటలను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇక ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో గనీ నుంచి చిన్న టీజర్ వదిలారు. ఇందులో ఆయనను చాలా పవర్ ఫుల్ గా చూపించారు. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి.. వరుణ్‌కి ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా కనిపించారు. కొంతమంది యోధులుగా తయారవుతారు కానీ 'గని' యోధుడిగా పుట్టాడు అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఇకపోతే ‘‘గనీ’’లో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ-సిద్దు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈపాటికే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాల్సి వుంది. అయితే కోవిడ్, ఒమిక్రాన్ కేసుల దృష్ట్యా విడుదల వాయిదా పడింది.

More News

చంద్రబాబుకు కరోనా.. ‘‘మావయ్య.. మీరు త్వరగా కోలుకోవాలి’’ : ఎన్టీఆర్ ట్వీట్

దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా వైరస్ బారినపడుతున్నారు.

ఐదుగురు హీరోయిన్లు, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లతో ‘‘రావణాసుర’’ పాలన ప్రారంభం

మాస్ మహారాజ్ వరుస సినిమాలతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు వున్నాయి.

కెరీర్ ను మలుపు తిప్పేలా "వర్మ"... వీడు తేడా- హీరో నట్టి క్రాంతి

న‌టుడిగా ర‌జ‌నీకాంత్‌ అంటే ఇష్టం. సినిమారంగంలో గురువులుగా డా. దాస‌రి నారాయ‌ణరావు, డా. డి. రామానాయుడు అయితే న‌ట‌న గురువుగా స‌త్యానంద్ గార‌ని

ఏపీలో నేటి నుంచే అమల్లోకి నైట్ కర్ఫ్యూ.. వారికి మాత్రం మినహాయింపు

కరోనా కేసులు మరోసారి పెరుగుతుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు మరోసారి ఆంక్షలను అమలు చేస్తున్నాయి.

తెలుగువారి ఫేవరేట్ 'చింతామణి' డ్రామాపై ఏపీ సర్కార్ నిషేధం.. ప్రదర్శిస్తే కఠిన చర్యలు

సినిమాలు, సీరియళ్లు రాకముందు తెలుగునాట ప్రజలకు వినోదం అందించింది నాటకాలే. వారాంతాలతో పాటు పండుగల వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ నాటకాలు ఊరూవాడా రంజింపజేసేవి.