మిస్టర్ పై క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్..

  • IndiaGlitz, [Thursday,June 09 2016]

మెగా హీరో వ‌రుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం మిస్ట‌ర్. ఈ చిత్రానికి న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి నిర్మాత‌. ఇటీవ‌ల‌ పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే స్పెయిన్ షెడ్యూల్ జ‌రుగుతూ ఉండాలి. అయితే...ఏమైందో ఏమో కానీ...అనుకున్న డేట్ కి మిస్ట‌ర్ స్పెయిన్ షెడ్యూల్ ప్రారంభం కాలేదు.
ఇదిలా ఉంటే...వ‌రుణ్ తేజ్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు అంగీక‌రించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించ‌నున్నారు. దీంతో వ‌రుణ్ తేజ్, శ్రీను వైట్ల సినిమా మిస్ట‌ర్ ఆగిపోయింది అంటూ ప్ర‌చారం ప్రారంభ‌మైంది. ఈ ప్ర‌చారానికి ఫుల్ స్టాఫ్ పెట్టేలా వ‌రుణ్ తేజ్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...శ్రీను వైట్ల గారితో చేయ‌నున్న సినిమా ఈనెల 27 నుంచి సెట్స్ పైకి వెళుతుంది. ఈ నెల 27న స్పెయిన్ లో షూటింగ్ చేయ‌నున్నాం అని తెలియ‌చేసారు.

More News

జూన్ చివరి వారంలో విడుదలకి సిద్దమవుతున్న 'అంతం' ట్రైలర్

గుంటూరు టాకీస్ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రంతో యువత హ్రుదయాల్లో పర్మినెంట్ ప్లేస్ ని సొంతం చేసుకున్న రష్మిగౌతమ్ హీరోయిన్ గా ప్రదాన పాత్రలో నటించిన చిత్రం అంతం.

అప్పుడు బాలయ్య ప్యాన్...ఇప్పుడు పవన్ కల్యాణ్...

నేటి తరం యంగ్ హీరోస్ లో మంచి సక్సెస్ రేట్ ఉన్న హీరో నాని,ప్రతి సినిమాను డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటూ సినిమాలు చేస్తున్న ఈ హీరో

ప్రేమమ్ లో వెంకటేష్....

అక్కినేని నాగచైతన్య హీరోగా.సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో మలయాళ చిత్రం ప్రేమమ్

గుడులు..గోపురాలు చుట్టూ తిరుగుతున్న డైరెక్ట‌ర్

గుడులు..గోపురాలు చుట్టూ తిరుగుతున్న డైరెక్ట‌ర్..ఎవ‌రో కాదు బ్ర‌హ్మోత్స‌వం డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల‌. మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన బ్ర‌హ్మోత్స‌వం అంచ‌నాల‌ను ఏమాత్రం అందుకోలేక‌పోయింది.

తొలిప్రేమ గొప్పతనం చెప్పే గుప్పెడంత ప్రేమ

సాయి రోనక్,అదితి సింగ్ జంటగా నూతన దర్శకుడు వినోద్ లింగాల తెరకెక్కించిన చిత్రం గుప్పెడంత ప్రేమ.ఈ చిత్రాన్ని ఐ వింక్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందించారు.