close
Choose your channels

బాబాయ్‌ టైటిల్‌తో వరుణ్‌ తేజ్‌..

Tuesday, January 19, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాబాయ్‌ టైటిల్‌తో వరుణ్‌ తేజ్‌..

కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్‌ మూవీకి 'గని' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జనవరి 19న వరుణ్‌తేజ్‌ పుట్టినరోజు ఈ సందర్భంగా 'గని' ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎలివేట్‌ చేసేలా ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ సినిమా కోసం ఓలింపిక్ బాక్సింగ్ విన్న‌ర్ టోని జెఫ్రీస్ ద‌గ్గ‌ర ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను తీసుకున్నాడు వరుణ్ తేజ్. ఉపేంద్ర‌, జ‌గ‌ప‌తిబాబు, బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ నటిస్తోంది. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వరుణ్‌తేజ్‌ ఈ మూవీ టైటిల్‌ గని అని వింటే మనకు పవన్‌కల్యాణ్‌ సినిమా బాలు గుర్తుకు వస్తుంది. బాలు చిత్రంలో పవన్‌ పాత్ర పేరు గని. గతంలో పవన్‌ కల్యాణ్‌ తొలిప్రేమ సినిమా టైటిల్‌తో హిట్‌ కొట్టిన వరుణ్‌ తేజ్‌.. ఈసారి పవర్‌ పాత్ర పేరుని తన సినిమా టైటిల్‌ గని అని పెట్టుకుని జూలైలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈసారి ఎలాంటి హిట్‌ అందుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.