‘ఆచార్య’కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన వరుణ్ తేజ్

మెగాస్టార్‌ చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌ పై ఎస్. నిరంజన్ రెడ్డి, రామ్‌ చరణ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇవాళ కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించి అభిమానులకు నచ్చే అప్‌డేట్‌ను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 29 (శుక్రవారం) సాయంత్రం 4:05 గంటలకు టీజర్ విడుదల చేయబోతున్నట్టు ఓ వీడియో ద్వారా ప్రకటించారు.

కొరటాల శివ అప్‌డేట్ ఇచ్చిన కాసేపటికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. ఇక ఇదైతే అభిమానులకు మరింత నచ్చుతుందనడంలో సందేహం లేదు. 29న రాబోయే టీజర్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడట. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వరుణ్ తేజ్ వెల్లడించాడు. ఈ నెల 29న సాయంత్రం 4:05 గంటలకు ధర్మస్థలి తలుపులు తెరుచుకోబోతున్నాయంటూ నేడు చిత్రబృందం వీడియోలో ప్రకటించింది. అయితే రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

రామ్ చరణ్ నటిస్తున్నాడన్న విషయం తెలియగానే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఈ సినిమాలో చెర్రీ నక్సలైట్ నాయకుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే చెర్రీ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. చెర్రీ కోసం కొరటాల ఓ పాటను కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ టెంపుల్ టౌన్ సెట్స్‌లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ధర్మస్థలి అనే గ్రామం వేదికగా కథ నడుస్తుందని తెలుస్తోంది. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More News

ఐయామ్ శివ.. నా గొంతులో హాలాహలం ఉంది: పద్మజ

మదనపల్లె అక్కా చెల్లెళ్ల కేసులో నిందితురాలు పద్మజ క్షణానికో విధంగా ప్రవర్తిస్తున్నారు. తన భర్తను భర్తే కాదంటూ హడలెత్తిస్తున్నారు.

ఆస్కార్‌కు నామినేట్ అయిన 'ఆకాశం నీ హద్దురా'!

సూర్య, అపర్ణ బాలమురళి జంటగా నటించిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ ఆత్మకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

'ఆచార్య' టీజర్ వస్తుందనుకుంటే అప్‌డేట్ ఇచ్చారు

మెగాస్టార్‌ చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఎర్రకోటపై జెండా ఎగరేసింది బీజేపీ వ్యక్తేనట

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికింది! అన్నదాతలు తలపెట్టిన కిసాన్‌ పరేడ్‌ దేశ రాజధాని ఢిల్లీని రణరంగంగా మార్చింది. ఒక్కసారిగా దేశమంతా ఢిల్లీపైనే దృష్టి సారించేలా చేసింది.

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. డిజిటల్ కరెన్నీని...

ప్రస్తుతం నడుస్తున్నది డిజిటల్ యుగం. కాబట్టి నగదు కూడా డిజిటల్ కరెన్సీ రూపంలో లభ్యమైతే ఎలా ఉంటుంది? ఊహ అయితే బాగానే ఉంది కానీ ఇది సాధ్యమా అనిపిస్తోంది కదా..