close
Choose your channels

బాక్సింగ్‌లో ట్రైనింగ్‌ కోసం ముంబైకి వరుణ్!

Saturday, October 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాక్సింగ్‌లో ట్రైనింగ్‌ కోసం ముంబైకి వరుణ్!

వైవిధ్యమైన క‌థా చిత్రాల‌కు ప్రాధాన్యం ఇస్తూ హీరోగా త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌త‌ను సంపాదించుకున్నారు మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్‌. ఈ ఏడాది ‘ఎఫ్ 2’, ‘గ‌ద్దల‌కొండ గ‌ణేష్’ చిత్రాలతో సూప‌ర్‌డూప‌ర్ హిట్స్‌ను సొంతం చేసుకున్న మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌ హీరోగా గురువారం హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్ దైవ స‌న్నిధానంలో కొత్త చిత్రం ప్రారంభ‌మైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో బాక్సర్‌గా వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. దీంతో బాక్సింగ్‌లో శిక్షణ పొందడానికి గాను వరుణ్ 2 నెలల పాటు బాక్సింగ్ ముంబై వెళుతున్నట్లు సమాచారం. అక్టోబర్, నవంబర్ రెండు నెలలపాటు బాక్సింగ్‌లో శిక్షణను పూర్తిచేసుకుని తేజ్ తిరిగి డిసెంబర్‌లో తిరిగి హైదరాబాద్ రానున్నాడు. కాగా.. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని చిత్రబృందం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదిలా ఉంటే.. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై కిర‌ణ్ కొర్రపాటి ద‌ర్శక‌త్వంలో సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు స‌న్నివేశానికి నాగ‌బాబు క్లాప్ కొట్టగా, కొణిదెల సురేఖ కెమెరా స్విచ్ఛాన్ చేసిన విషయం విదితమే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.