close
Choose your channels

'భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు' ట్రైల‌ర్ విడుద‌ల చేసిన వ‌రుణ్ తేజ్‌

Wednesday, November 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు ట్రైల‌ర్ విడుద‌ల చేసిన వ‌రుణ్ తేజ్‌

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను బుధ‌వారం మెగ్రాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ విడుద‌ల చేశారు.

సినిమా ట్రైల‌ర్ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. సినిమా ఇంత‌కు మించి ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని భావిస్తున్నాను. సినిమా చాలా పెద్ద హిట్ కావాలంటూ ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు వ‌రుణ్‌తేజ్‌.

ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. డిసెంబ‌ర్ 6న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` ర‌చ‌యిత ప‌రం సూర్యాన్షు ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లేను అందించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.