తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం.. వ‌రుణ్ తేజ్ స్పంద‌న‌

  • IndiaGlitz, [Wednesday,June 12 2019]

యువ క‌థానాయ‌కుడు, మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్‌కు ఈరోజు తృటిలో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. వివ‌రాల్లోకెళ్తే తెలంగాణ రాష్ట్రం వ‌న‌ప‌ర్తి జిల్లా కొత్త‌కోట ద‌గ్గ‌ర వ‌రుణ్‌తేజ్ కారు ప్ర‌మాదానికి గురైంది. అయితే వ‌రుణ్‌తేజ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్ర‌మాదం నుండి ఆయ‌న సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. కానీ కారు మాత్రం ధ్వంస‌మైంది.

ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ 'వాల్మీకి' సినిమా  చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రేపు సినిమా షూటింగ్ యాగంటిలో ఉంది. షూటింగ్ నిమిత్తం వ‌రుణ్ యాగంటి వెళుతుండ‌గా ఎదురుగా కొంద‌రు కుర్రాళ్లు కారులో వ‌చ్చి ఢీ కొట్టారు. వ‌రుణ్ కారును ఢీ కొట్టిన కుర్రాళ్లు మ‌ద్యం మ‌త్తులో ఉన్నారు. కారు ప్ర‌మాదం జ‌ర‌గ్గానే కారులోని బెలూన్స్ ఓపెన్ కావ‌డంతో.. వ‌రుణ్‌కు ఎలాంటి హాని జ‌ర‌గ‌లేదు.

త‌న‌తో స‌హా ఎవ‌రికీ ఎలాంటి హాని జ‌ర‌గ‌లేదు. అంద‌రం క్షేమ‌మే. ఎలాంటి గాయాలూ కాలేదు. మీ ప్రేమ‌కు, అభిమానికి కృత‌జ్ఞ‌త‌లు' అంటూ ట్విట్ట‌ర్ ద్వారా వ‌రుణ్ తేజ్ త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు.

More News

దాంట్లో ఇద్ద‌రూ ఒక‌టేన‌ట‌

బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్‌ఖాన్‌, టాలీవుడ్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మంచి స్నేహితులు. స‌ల్మాన్, హైద‌రాబాద్ వ‌చ్చిన ప్ర‌తి సంద‌ర్భంలో చ‌ర‌ణ్‌ను క‌లుస్తాడు. అలాగే చ‌ర‌ణ్‌, ముంబై వెళ్లిన ప్ర‌తిసారి సల్మాన్‌ఖాన్‌

గిఫ్ట్‌పై ఆశ‌తో రూ.85000ల‌ను పొగొట్టుకున్న హీరోయిన్‌

సైబ‌ర్ నేర‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండండి మొర్రో అని పోలీసులు మొత్తుకుంటున్న ప్ర‌జ‌ల‌కు ఏమాత్రం ప‌ట్ట‌దు.

త‌మ‌న్నా కోరిక నెర‌వేరుతుందా

త‌మ‌న్నాని చూసిన చాలా మంది డ్యాన్సుల్లో శ్రీదేవికి స‌రిజోడీ ఈ కాలంలో త‌మ‌న్నానే అని అంటారు. ఫ్లోర్ మీద స్లిమ్‌గా స్టెప్పులేయ‌డంలో ఈ మిల్కీ బ్యూటీ ఆ

'ఓటర్‌' ఈ నెల 21న విడుదల

రామా రీల్స్‌ బ్యానర్‌పై జాన్‌ సుధీర్‌ పూదోట నిర్మాతగా విష్ణు, సురభి జంటగా జి.ఎస్‌.కార్తీక్‌ దర్శకత్వం వహించిన 'ఓటర్‌'

షాలిని.. హీటు జ‌న‌రేట‌ర్‌

అస‌లే వేస‌వికాలం ఉక్క‌పోత‌తో అల్లాడుతుంటే, కుర్ర‌కారుకు త‌న బికినీ సొగ‌సులు చూపించి మ‌రీ రెచ్చ‌గొట్టి అల్లాడించేస్తోంది షాలినీ పాండే.