బాన్స్ వాడలో వరుణ్ తేజ్ ఫిదా..!

  • IndiaGlitz, [Thursday,September 08 2016]

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం ఫిదా. ఈ చిత్రాన్ని శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమెరికా అబ్బాయి - తెలంగాణ అమ్మాయి ప్రేమలో ప‌డ‌డం అనే క‌థాంశంతో ఈ చిత్రాన్నిరూపొందిస్తున్నారు.
ఇటీవ‌ల నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడ‌లో ఈ చిత్రం ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా హీరో వ‌రుణ్ తేజ్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...బాన్స్ వాడ‌లో షూటింగ్ చాలా స‌ర‌దాగా జ‌రిగింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఉన్నాం అంటూ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి, డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌తో క‌లిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసాడు. నెక్ట్స్ షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

More News

కొర‌టాల‌, మ‌హేష్ మెసేజ్ అదేనా...?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్ర‌హ్మోత్సవం ప్లాప్ త‌ర్వాత ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు.  ర‌కుల్ ప్రీత్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

నితిన్‌, హను రాఘవపూడి కాంబినేషన్‌లో 14 రీల్స్‌ కొత్త చిత్రం ప్రారంభం

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరో వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.9గా నిర్మిస్తున్న కొత్త చిత్రం సెప్టెంబర్‌ 8న సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది.

నవరస నట తిలకం మోహన్ బాబు..!

తెలుగు తెరపై ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి...ప్రేక్షకులను ఆకట్టుకుని తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్నారు విలక్షణ నటుడు మోహన్ బాబు.

బాహుబ‌లి 2 కోసం నాగార్జున‌..!

బాహుబలి 2 ఓ వైపు షూటింగ్ జ‌రుగుతుండ‌గానే...మ‌రో వైపు చ‌క‌చ‌కా బిజినెస్ జ‌రిగిపోతుంది. ఇంత‌కీ బాహుబ‌లి 2 కోసం నాగార్జున..? ఏమిటి అనుకుంటున్నారా..?

అథ్లెటిక్ పాత్ర‌లో ర‌కుల్‌...

ప్ర‌స్తుతం  సూప‌ర్‌స్టార్ మ‌హేష్, ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ ల చిత్రంతో పాటు మెగా ప‌వ‌ర్‌స్టార్  రామ్ చ‌ర‌ణ్ ధృవ చిత్రంతో పాటు సాయిద‌ర‌మ్ తేజ్, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తుంది.