'మిస్టర్' ..నాకు గుర్తుండిపోయే చిత్రం - వరుణ్ తేజ్

  • IndiaGlitz, [Tuesday,April 11 2017]

వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్‌ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై శ్రీనువైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్‌ మధు నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'మిస్టర్‌'. సినిమా ఏప్రిల్‌ 14న విడుదలవుతుంది.

ఈ సందర్భంగా హీరో వరుణ్‌తేజ్‌తో ఇంటర్వ్యూ...

ఏడాదిపాటు...

'మిస్ట‌ర్‌' సినిమా కోసం ఏడాది పాటు శ్రీనువైట్ల‌గారితో ట్రావెల్ చేస్తున్నాను. లైన్ విన్న‌ప్ప‌ట్నుంచి మా మ‌ధ్య జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. మ‌ర‌చిపోలేని జ‌ర్నీగా మిస్ట‌ర్ సినిమా నాకు గుర్తుండిపోతుంది. సినిమా షూటింగ్‌లో భాగంగా స్పెయిన్‌, ఇట‌లీ, స్విజ్జ‌ర్లాండ్ న‌గ‌రాల‌తో పాటు కేర‌ళ‌, చిక్‌మ‌గ‌లూరు, ఊటీ ప్రాంతాల్లో షూట్ చేశాం. ఈ సినిమా షూట్ చేసే స‌య‌మంలో యూనిట్ మ‌ధ్య మంచి రిలేష‌న్ ఏర్ప‌డి, అంతా ఫ్యామిలీలా సినిమాను పూర్తి చేశాం.

'మిస్ట‌ర్' అంటే..

'మిస్ట‌ర్‌' అంటే మ‌న‌కు తెలియ‌ని వారిని మ‌నం మిస్ట‌ర్ అని సంబోధిస్తుంటాం. క‌థ‌లో భాగంగా హీరోయిన్‌, హీరోను రెండు, మూడు సార్లు మిస్ట‌ర్ అని పిలుస్తుంది. ఇక క్యారెక్ట‌ర్ విష‌యానికి వ‌స్తే మిస్ట‌ర్ ప్రేమ‌ను పంచుతాడు. ఎవ‌రికైనా స‌హాయం కావాల‌న్నా ముందుండి చేస్తుంటాడు. అలాంటి వ్య‌క్తికి స‌మ‌స్య‌లు వ‌స్తే అత‌నేం చేస్తాడు. త‌న ప్రేమ‌ను వెతుక్కుంటూ ఎక్క‌డికి వెళతాడ‌నేదే సినిమా. ట్రావెల్, ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ. నాకు హీరోయిన్స్ లావ‌ణ్య‌, హెబ్బా ప‌టేల్‌కు అంద‌రికీ ఓ బ్యాక్ స్టోరీ ఉంటుంది. దీంతో పాటు ల‌వ్ స్టోరీ కూడా ఉంటుంది.

శ్రీనువైట్ల‌గారికి ఇదేం కొత్త కాదు...

శ్రీనువైట్ల‌గారు కెరీర్ స్టార్టింగ్‌లో ఆనందం, నీకోసం వంటి ల‌వ్‌స్టోరీస్ చేసి హిట్స్ కొట్టారు. క‌మ‌ర్షియ‌ల్ పార్మేట్‌లో హిట్ కొట్ట‌గానే అంద‌రూ అలాంటి సినిమాలు అడిగారు. రీసెంట్‌గా ఆయ‌న‌కు స‌రైన హిట్ లేక‌పోవ‌డంతో ఆ విష‌యాన్ని రియ‌లైజ్ అయ్యి మ‌ళ్ళీ మూలాల్లోకి వెళ్ళి చేసిన సినిమాయే 'మిస్ట‌ర్‌'. అంతే త‌ప్ప ఈ సినిమా కోసం ఆయ‌నేం కొత్త‌గా ట్రై చేయ‌లేదు.

డైరెక్ట‌ర్ ఆ విష‌యంలో కేర్ తీసుకున్నారు..

డైరెక్ట‌ర్ శ్రీనువైట్ల ఈ సినిమ‌లో నా బాడీ లాంగ్వేజ్ కొత్త‌గా ఉండాల‌ని, ముందుగానే చెప్పారు. అందుకోసం న‌న్ను ప్రిపేర్ చేశారు. ఇంత‌కు ముందు చేసిన మూడు సినిమాల్లో ఇంటెన్సిటి ఉన్న పాత్ర‌లు చేశాను. ఈ సినిమాలో నా ఏజ్‌కు త‌గ్గ‌ట్లు ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ చేశారు. ఈ సినిమాలో రొమాంటిక్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను.

కొత్త ద‌ర్శ‌కుల‌తో చేస్తాను..

నేను సీనియ‌ర్ డైరెక్ట‌ర్స్‌తోనే చేయాల‌ని అనుకోను. కొత్త ద‌ర్శ‌కుల‌త కూడా ప‌నిచేయాల‌నుకుంటున్నాను. ఈ మ‌ధ్య షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ‌ప్పుడు దాదాపు 20 కొత్త క‌థ‌ల‌ను విన్నాను. శేఖ‌ర్ క‌మ్ముల‌గారి ఫిదా సినిమా త‌ర్వాత వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాను.

నా ఆలోచ‌న అలా ఉండ‌దు...

ఒక జ‌ర్నీలో స‌క్సెస్‌లు ఫెయిల్యూర్స్ కామ‌న్‌గా ఉంటాయి. అది నాకైనా, ఎవ‌రికైనా కావ‌చ్చు. ఓ ఆలోచ‌న‌తోనే సినిమాలు చేయాల‌నుకోను. రీసెంట్‌గా శ్రీనువైట్ల‌గారికి మంచి విజయం లేనంత మాత్రాన ఆయన చేయలేరని కాదు. అందుకే ఆయన దాన్ని కూడా ప్రూవ్‌ చేసుకోవాలని, యంగ్‌ హీరో హీరోయిన్స్‌తో ఓ మంచి ఫ్రెష్‌ లవ్‌స్టోరీ చేయాలని ఆయన అనుకున్నారు. శ్రీనువైట్లగారి వంటి డైరెక్టర్‌ చాలా మందితో వర్క్‌ చేశారు. ఆయనకున్న ఎక్స్‌పీరియెన్స్‌ ఎక్కువ. ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం అనేది నాకు మంచి లర్నింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌. శ్రీనువైట్లగారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటికీ శ్రీనువైట్లగారు బాగా కష్టపడుతుండటం కళ్ళారా చూశాను. నేనెప్పుడైనా బద్ధకించినా ఆయన్ను చూస్తే ఇన్‌స్పైరింగ్‌గా ఉండేది.

నాన్నకు నాపై నమ్మకం ఉంది..

నాన్నగారు, నేను ఖాళీ ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుతాను. నాన్నగారికి నాపై నమ్మకం ఉంది. నా విషయంలో నాన్నగారు హ్యాపీగా ఉన్నారు. కథ ఎంపికలో నాన్న ఎప్పుడూ జోక్యం చేసుకోరు. నీ జర్నీ నువ్వే చేయాలని అంటారు.

తప్పకుండా చేస్తాం..

నేను క్రిష్‌తో రాయభారి చేయాల్సింది కానీ కొన్ని కారణాలతో కుదరలేదు. నేను, క్రిష్‌తో మాట్లాడుతూనే ఉన్నాను. 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా రిలీజ్‌ తర్వాత క్రిష్‌ను అభినందించాను. తను ఇప్పుడు బాలీవుడ్‌ మూవీ ప్లానింగ్‌లో ఉన్నాడు. నాకు కూడా రెండు, మూడు కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. రాయభారి మంచి స్క్రిప్ట్‌ భవిష్యత్‌లో తప్పకుండా చేస్తాం.

'ఫిదా' సినిమా గురించి..

'ఫిదా' కూడా ల‌వ్‌స్టోరీనే అయితే కొంచెం క్లాస్‌గా ఉంటుంది. సినిమా 75 శాతం పూర్త‌య్యింది. మ‌రో 20-25 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మంచి రిలీజ్ డేట్ చూసుకుని సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం.

గీతాఆర్ట్స్‌లో మూవీ గురించి...

అల్లు అర‌వింద్‌గారు గీతాఆర్ట్స్‌లో సినిమా చేయ‌మ‌ని చాలా రోజులుగా అడుతున్నారు. రీసెంట్‌గా బ‌న్ని పుట్టిన‌రోజున నాన్న‌వెళితే అర‌వింద్‌గారు సినిమా చేద్దామ‌ని అన్నారు. కానీ మంచి క‌థ దొర‌క‌డం లేదు. మంచి క‌థ దొర‌క‌గానే త‌ప్ప‌కుండా చేస్తాను.

నేను రెడీ...

నేను పెద్ద‌నాన్న చిరంజీవిగారి త‌ర్వాత చ‌ర‌ణ్ అన్న‌య్య‌తో క్లోజ్‌గా ఉంటాను. అలాగే తేజ్‌, బ‌న్ని ఇలా అంద‌రూ వీలున్న‌ప్పుడ‌ల్లా క‌లుస్తుంటాం. మంచి క‌థ దొరికితే వీరితే క‌లిసి సినిమా చేయ‌డానికి నేను సిద్ధ‌మే.

More News

గోపీచంద్ సాహసం..

సౌఖ్యం తర్వాత గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో జె.భగవాన్,పుల్లారావు నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'గౌతమ్ నంద`

మహేష్ కొత్త వ్యాపారం...

సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు చిత్రంతో ఎం.బి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పెట్టి నిర్మాతగా మారాడు.

తొలి దశ షూటింగ్ పూర్తి చేసుకున్న పెళ్లి కథ

శ్రీ రామాంజనేయులు ఇంటర్నేషనల్ మూవీ కార్పొరేషన్ పతాకం పై వడ్డి రామాంజనేయులు నిర్మాతగా రూపొందుతొన్న సినిమా 'పెళ్లి కథ'.

చైతు సినిమా రిలీజ్ డేట్

ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య

విష్ణుతో ప్రగ్యా...

లక్కున్నోడు చిత్రం ఆశించిన మేర సక్సెస్ కాకపోవడంతో మంచు విష్ణు