చెర్రీ విల‌న్‌తో వ‌రుణ్..!

  • IndiaGlitz, [Saturday,December 05 2020]

డిప‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే వ‌రుణ్ తేజ్ ..గత ఏడాది 'ఎఫ్ 2', 'గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్' చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ యంగ్ హీరో రెండు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల త‌ర్వాత స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే ఈ చిత్రానికి బాక్స‌ర్ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇందులో స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా కోసం ఓలింపిక్ బాక్సింగ్ విన్న‌ర్ టోని జెఫ్రీస్ ద‌గ్గ‌ర ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను తీసుకున్నాడు వరుణ్ తేజ్. లాక్‌డౌన్ త‌ర్వాత సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. కాగా లేటెస్ట్ సమాచారం మేురకు ఇందులో మెయిన్ విలన్‌గా జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తున్నాడ‌ట‌. ఇటు మాస్‌, అటు క్లాస్ విల‌నిజంతో మెప్పిస్తూ వ‌చ్చిన జ‌గ‌ప‌తిబాబుఈ సినిమాలో ఎలా ఆక‌ట్టుకుంటాడో చూడాలి. ప్ర‌స్తుతం వ‌రుణ్‌తేజ్ నిహారిక పెళ్లిప‌నుల‌తో బిజీ బిజీగా ఉన్నాడు.

ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తల్లి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుంది.మ‌రి ఈ సినిమాతో హిట్ కొట్టి.. వ‌రుణ్ తేజ్ హ్యాట్రిక్ కొడ‌తాడేమో వేచి చూడాలి.

More News

బాలీవుడ్ ‘ఛ‌త్ర‌ప‌తి’ త‌ల్లి పాత్ర‌లో న‌టిస్తున్న‌దెవ‌రంటే?

టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది.

మహేశ్ సినిమాలో పవన్..?

కొన్ని కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ గురించి విన్న‌ప్పుడు జ‌రుగుతుందో లేదో కానీ.. జ‌రిగితే బావుండు‌న‌ని అంద‌రూ అనుకుంటారు.

సెన్సేష‌న‌ల్ పాత్ర‌లో అంజ‌లి..?

ఫొటో సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అంజలి తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్లు, డిక్టేటర్, గీతాంజలి సహా పలు తెలుగు చిత్రాలతో

మ‌రోసారి అలాంటి టైటిల్‌తో మెగాస్టార్..!

వీలైనంత త్వ‌ర‌గా ఆచార్య సినిమాను పూర్తి చేసి లూసిఫ‌ర్ రీమేక్‌లో న‌టించాల‌ని చిరంజీవి భావిస్తున్నాడ‌ట‌.

బాల‌య్య కోసం ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌తో సినిమా.. ఓకే అంటాడా?

నంద‌మూరి బాల‌కృష్ణ‌తో డైరెక్ట‌ర్ సంతోష్ జాగ‌ర్ల‌పూడి ఓ సినిమాను చేయాల‌ని అనుకున్నాడు.