ఈ సొసైటీ గెలిచినవాడి మాటే నమ్ముతుంది ... ఆకట్టుకుంటోన్న వరుణ్ తేజ్ ‘గని’ ట్రైలర్

  • IndiaGlitz, [Thursday,March 17 2022]

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘‘గని’’ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 8న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈపాటికే విడుదలకావాల్సిన ఈ సినిమా కొవిడ్‌ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తర్వాత పరిస్ధితులు కుదుటపడటంతో ఫిబ్రవరి 25న లేదా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఫిబ్రవరి 25ని ఫిక్స్ చేశారు కూడా. అదే రోజున ‘భీమ్లా నాయక్‌’ రిలీజ్ అవ్వడంంతో గని మరోసారి వాయిదాపడక తప్పలేదు.

కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ‘‘గని’’ బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అల్లు అరవింద్ సమర్పకుడిగా.. అల్లు బాబీ కంపెనీ, రినైస్సన్స్ పిక్చర్స్ పతాకాల‌పై ‘‘గని’’ని సిద్ధు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలకపాత్ర పోషిస్తుండగా.. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఈ నేపథ్యంలో గని రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ.. సినిమా నుంచి ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. గని .. ఇక లైఫ్‌లో బాక్సింగ్ ఆడనని ప్రామిస్ చెయ్' అంటూ హీరోని తల్లి కోరడంతో ఈ ట్రైలర్ మొదలవుతుంది. 'ఒకవేళ అమ్మకి నిజం తెలిసే రోజే వస్తే, అది తాను నేషనల్ ఛాంపియన్ విజేతగా నిలిచే రోజే కావాలి'. ఈ సొసైటీ ఎప్పుడూ గెలిచినవాడి మాటనే నమ్ముతుంది' అనే డైలాగులు బాగున్నాయి. ’గని’ మూవీకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా టోటల్ రన్ టైమ్ 2 గంటల 31 నిమిషాల 17 సెకన్లు ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

More News

సమ్మక్క- సారలమ్మలపై వ్యాఖ్యలు: చిక్కుల్లో చిన్నజీయర్ స్వామి, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. ఆదివాసీల నిరసన

ప్రముఖ ఆధ్యాత్మిక గురు చినజీయర్ స్వామి చిక్కుల్లో పడ్డారు. ఆదివాసీల వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను

బిబిసి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో జీ5 నిర్మిస్తున్న  ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌  మోషన్ పోస్టర్‌ విడుదల

ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌  వెబ్‌ సిరీస్‌లతో వీక్షకుల మనసులు దోచుకుంటోంది Zee5.

చరిత్రను మార్చి రాస్తా..ఆకట్టుకుంటున్న "బిచ్చగాడు 2" థీమ్ సాంగ్

విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన సినిమా బిచ్చగాడు.  ఈ చిత్రానికి ప్రస్తుతం బిచ్చగాడు 2 పేరుతో  సీక్వెల్ రూపొందుతోంది.

వృద్ధులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఆర్టీసీలో 60 ఏళ్లు దాటిన వారికి డిస్కౌంట్ : పేర్ని నాని ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ దృష్ట్యా 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆర్టీసీ నిలిపివేసిన 25 శాతం రాయితీని పునరుద్ధరిస్తున్నట్టు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్ మన్ ప్రమాణ స్వీకారం.. పసుపు వర్ణమైన ఖట్కర్ కలన్

పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్‌ మన్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.