close
Choose your channels

వ‌రుణ్‌తేజ్‌తో న‌టిస్తోన్న హీరోయిన్‌?

Saturday, April 4, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వ‌రుణ్‌తేజ్‌తో న‌టిస్తోన్న హీరోయిన్‌?

ఈ ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న యువ హీరో వ‌రుణ్ తేజ్‌. డిప‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే వ‌రుణ్ తేజ్ రెండు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల త‌ర్వాత స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేయ‌డానికి రెడీ అయిపోయాడు. ఈ చిత్రానికి బాక్స‌ర్ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇందులో స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. కాగా ఇందులో మరో హీరోయిన్‌కు ఆస్కారం ఉంద‌ని ఆ పాత్ర‌లో లావ‌ణ్య న‌టిస్తుంద‌ని అంటున్నారు.

ఈ సినిమా కోసం ఓలింపిక్ బాక్సింగ్ విన్న‌ర్ టోని జెఫ్రీస్ ద‌గ్గ‌ర ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను తీసుకున్నాడు. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి కూడా న‌టిస్తున్నాడు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తల్లి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుంది. కాగా.. సినిమాను ఈ ఏడాది జూలై 30న విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. మ‌రి ఈ సినిమాతో హిట్ కొట్టి.. వ‌రుణ్ తేజ్ హ్యాట్రిక్ కొడ‌తాడేమో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.