అండర్ వాటర్ లో ఎమోషనల్ రొమాన్స్..'వసంత కోకిల' టీజర్

  • IndiaGlitz, [Friday,June 25 2021]

తన విలక్షణ నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాబీ సింహా. ఎలాంటి పాత్రలో అయినా సింహా అద్భుతంగా నటించగలడు. నెగిటివ్ రోల్స్ అయితే తన విశ్వరూపమే ప్రదర్శిస్తాడు సింహా. 2014లో వచ్చిన జిగర్తాండ చిత్రం సింహా క్రేజ్ ని అమాంతం పెంచేసింది.

ఆ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ లో సింహా నటన అద్భుతం అనే చెప్పాలి. ఆ చిత్రాన్నే తెలుగులో గద్దలకొండ గణేష్ గా రీమేక్ చేశారు. ఇదిలా ఉండగా సింహా నుంచి తాజాగా వస్తున్న చిత్రం 'వసంత కోకిల'. తెలుగు, తమిళ, కన్నడలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ని రిలీజ్ చేశారు.

ఉత్కంఠ కలిగించేలా ఉన్న టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచే విధంగా ఉంది. ఈ చిత్రంలో సింహా, యంగ్ బ్యూటీ కాశ్మీరా పర్దేషి జంటగా నటిస్తున్నారు. టీజర్ ఓపెనింగ్ షాట్ లో వీరిద్దరి మధ్య అండర్ వాటర్ రొమాన్స్ చూపించారు.

కన్ఫ్యూషన్, పెయిన్, ఆవేశం ఇలా అన్ని షేడ్స్ ఉన్న వ్యక్తిగా సింహా ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. ఏదో మిస్టీరియస్ సబ్జెక్టుతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు టీజర్ ద్వారా అర్థం అయింది. రమణన్ పురుషోత్తమ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఎస్ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రజిని తాళ్లూరి నిర్మిస్తున్నారు. రాజేష్ మురుగేశన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

More News

కేసులో ఊరట .. శ్రీవారిని దర్శించుకున్న నవనీత్ కౌర్

ప్రముఖ నటి, ఎంపీ నవనీత్ కౌర్ తిరుమలలో శ్రీవారికి దర్శించుకున్నారు. ఇటీవల కొంతకాలంగా నవనీత్ కౌర్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

బిగ్ సర్ ప్రైజ్.. మరో తెలుగు డైరెక్టర్ తో ధనుష్ పాన్ ఇండియా మూవీ

సౌత్ లో ధనుష్ క్రేజీ స్టార్ గా మారిపోతున్నారు. ఛాలెంజింగ్ రోల్స్ ఎంచుకుంటూ అందులో పరకాయ ప్రవేశం చేసి నటిస్తున్న ధనుష్ కు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రారంభమైన ప్రశాంత్ వర్మ సూపర్ హీరో మూవీ 'హను మాన్'!

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరో ఛాలెంజింగ్ చిత్రానికి రెడీ అయిపోయారు.

అల్లరి నరేష్ మూవీ రీమేక్.. చేతులు కలిపిన దిల్ రాజు, అజయ్ దేవ్‌గణ్‌

ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆసక్తికరమైన కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు. తాజాగా ఆయన హిందీ మార్కెట్ పై కన్నేశారు.

గర్భవతిగా ప్రియమణి.. క్రేజీ డీటెయిల్స్ ఇవిగో..

ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ప్రియమణి వివాహం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది.