21న వస్తున్న నయనతార 'వసంతకాలం'

  • IndiaGlitz, [Saturday,February 15 2020]

లేడి సూపర్ స్టార్ నయనతార నటించగా ఘన విజయం సాధించిన ఓ సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ ను 'వసంత కాలం' పేరుతొ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్. 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ ముఖ్య పాత్రలు పోషించారు. యువ సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి 'బిల్లా-2' ఫేమ్ చక్రి తోలేటి దర్సకత్వం వహించారు.

'5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై ఇంతకుముందు 'ఏకవీర, వెంటాడు-వేటాడు వంటి భారీ చిత్రాలు అందించిన యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. టాప్ హీరోలకు తీసిపోని సూపర్ క్రేజ్ కలిగి, ఇటు మెగాస్టార్ చిరంజీవితో 'సైరా'లో మెప్పించి.. అటు సూపర్ స్టార్ రజినీకాంత్ తో 'దర్బార్'లో జత కటైన నయనతార నటించిన హీరోయిన్ ఓరియంటడ్ చిత్రం 'వసంతకాలం'ను నిర్మిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను.

ఈనెల 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నయనతార నటన-గ్లామర్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్, చక్రి తోలేటి దర్శకత్వం, భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ తదితరుల పాత్రలు 'వసంతకాలం' చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. సుస్పెస్న్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధించి.. నయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుతుందనే నమ్మకముంది.. అన్నారు!!

More News

'15-18-24 లవ్ స్టోరీ' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన మెహ్రీన్ పిర్జాదా

వయసు ప్రభావం ప్రేమ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. పదిహేను, పద్దెనిమిది, ఇరవై నాలుగు వయసులలో ప్రేమ దాని పర్యవసానాల మీద అద్భుతమైన కథా కథనాలతో మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వంలో

హర్ట్ అయిన పవన్.. బీజేపీతో జనసేన కటీఫ్!?

బీజేపీతో కటీఫ్ కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారా..? బీజేపీతో మైత్రి కొనసాగిస్తున్నప్పటికీ తనకు ప్రాధన్యత ఇవ్వకపోవడంతో పవన్ హర్టయ్యారా..?

త్యాగరాయ గానసభలో ప్రముఖరచయిత ‘పురాణపండ  శ్రీనివాస్’ కు ఘన సత్కారం

మానసిక వ్యవస్థ విరాజిల్లడానికి అద్భుతమైన గ్రంథాల్ని రచించడంలో, ప్రచురించడంలో సత్యాన్వేషణతో కూడిన క్రొత్త సొగసుల్ని సృష్టించి వేలాదిమందికి ఆకట్టుకుంటున్న ప్రముఖరచయిత పురాణపండ శ్రీనివాస్

వైఎస్ జగన్ బావ అనిల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బావ, వైఎస్ షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ కుమార్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండెపోటుతో కుర్ర హీరో మృతి

మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.