close
Choose your channels

BiggBoss: గీతూ స్ట్రాటజీకి బలైన వాసంతి.. నామినేషన్, డిజాస్టర్ రెండూ ఆమె

Saturday, October 22, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ సీజన్ 6పై ప్రేక్షకులకు విరక్తి పుడుతోన్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్స్ ఆడటం లేదని కళ్లు తెరచుకున్న బిగ్‌బాస్... తానే ఆడటం మొదలుపెట్టాడు. ఫుడ్ టాస్క్ అని, అర్హత సాధించాలని కండీషన్లు పెడుతూ ఎలాగోలా బండి నెట్టుకుస్తున్నాడు బిగ్‌బాస్. ఇకపోతే.. ఈరోజు కూడా బిగ్‌బాస్ హౌస్‌లో బ్యాటిల్ ఫర్ సర్వైవర్ టాస్క్ నడిచింది. ఇనయా, శ్రీసత్య టీమ్ సభ్యులు సాధించిన పూలను లెక్కపెట్టగా... ఇనయా టీమ్ గెలిచింది. ఆమె టీమ్‌లో ఇనయా, ఆదిరెడ్డి, రేవంత్, బాలాదిత్య, కీర్తి, ఫైమా, శ్రీహాన్‌ వున్నారు. బిగ్‌బాస్ కండీషన్ ప్రకారం... గెలిచిన టీమ్ సభ్యులు సేఫ్ అవుతారు. దీంతో శ్రీసత్య... టీమ్ లీడర్ తానే అయినందువల్ల ముందు నేనే నామినేట్ అవుతానని చెప్పింది. కానీ ఇంటి సభ్యులందరితో చర్చించి చిట్టీలు రాయించి ఎవరి పేరొస్తే వారు నామినేషన్‌లోకి వెళ్లాలని చెప్పింది. కానీ దురదృష్టవశాత్తూ ఇక్కడా శ్రీసత్య పేరే రావడంతో నామినేషన్స్‌కు ఓకే చెప్పింది. మళ్లీ ఏమైందో కానీ తెల్లారేసరికి మళ్లీ మాట మార్చింది. మరోసారి డిస్కస్ చేద్దామని చెప్పింది.

ఈ చర్చల్లో గీతూ వాసంతి పేరు తెచ్చింది. శ్రీసత్య.. అర్జున్‌లు ఒకరి పేరు మరొకరు చెప్పుకున్నారు. కానీ తర్వాత మనసు మార్చుకుని అర్జున్ తన ఓటుని మెరీనాకు, మెరీనా... వాసంతికి, రాజ్ ... వాసంతికి వేశారు. ఎక్కువ మంది తన పేరు సూచించడంతో వాసంతి బాగా హర్ట్ అయ్యింది. ఎంత బాగా కంటెంట్ ఇస్తున్నా అస్సలు ఆడటం లేదని చెప్పడం బాధగా వుందంటూ కంటతడి పెట్టుకుంది. కానీ చేసేది లేక మెజారిటీ ఎక్కువగా వుండటంతో నెక్ట్స్ వీక్ నేరుగా నామినేట్ అయ్యింది.

అక్కడితో ఈ తతంగం ముగిసిపోతే అది బిగ్‌బాస్ హౌస్ ఎందుకవుతుంది. ఎపిసోడ్ చివరిలో మరో మెలిక పెట్టాడు బిగ్‌బాస్. ఇంటి సభ్యులకు డిజాస్టర్ టాస్క్ ఇచ్చాడు. హౌస్ మేట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలోకి రప్పించి.. అక్కడ డిజాస్టర్ అనే పేరుతో బ్యాడ్జీలు సిద్ధంగా వుంచాడు. ఒక్కో ఇంటి సభ్యుడు ఒక్కో బ్యాడ్జీని తీసుకుని సరిగా ఆడనివారికి డిజాస్టర్ బ్యాడ్జిని పట్టమని ఆదేశించాడు. అలా అర్జున్ రేవంత్‌కు, వాసంతి గీతూకి, మెరీనా గీతూకి, శ్రీసత్య రేవంత్‌కు, సూర్య వాసంతికి, గీతూ వాసంతికి, రేవంత్ వాసంతికి, ఆదిరెడ్డి వాసంతికి డిజాస్టర్ బ్యాడ్జి‌లు తగిలించారు. దీంతో ఇక్కడా తానే టార్గెట్ కావడంతో వాసంతి నొచ్చుకుంది. కానీ చేసేది లేక జైలుకు వెళ్లింది. అలా గీతక్క స్ట్రాటజీకి వాసంతి బలి పశువు అయిపోయింది.

ఇదిలావుండగా.... ఈ వారం హౌస్‌ని వీడబోయేది ఎవరన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇద్దరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు మెరీనా కాగా, రెండవ వ్యక్తి వాసంతి. వీరిద్దరూ ఆటలో పాల్గొనేది తక్కువ, మాట్లాడేది తక్కువ. నలుగురితో పాటు నారాయణ అనే టైపు. మెరీనా నిత్యం కిచెన్‌లోనో, తన భర్త రోహిత్ పక్కనో వుంటుంది తప్పించి ఎవరితోనూ గొడవ పెట్టుకుని, వాదించే రకం కాదు. వాసంతి బుట్టబొమ్మలా రెడీ అయి హౌస్‌లో కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది తప్పించి ఆమె నుంచి పెద్దగా కంటెంట్ రాదు. అయితే ఈరోజు ఎపిసోడ్‌లో అంతా ఆమెనే టార్గెట్ చేయడంతో వాసంతికి సానుభూతి ఓట్లు పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో మెరీనా డేంజర్‌ జోన్‌లో వున్నారు. ఇక ఈ వారం కెప్టెన్ సూర్య, గీతూ తప్పించి అందరూ నామినేషన్స్‌లో వున్న సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.