'వాసుకి' శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ టీవీ ఛానెల్

  • IndiaGlitz, [Wednesday,July 12 2017]

స్టార్‌ హీరోయిన్ న‌య‌న‌తార న‌టించిన చిత్రం 'వాసుకి'. మ‌ల‌యాళంలో సూప‌ర్‌హిట్ అయిన 'పుదియ నియ‌మం' సినిమాను తెలుగులో 'వాసుకి' పేరుతో శ్రీ‌రామ్ సినిమా ప‌తాకంపై ఎస్‌.ఆర్. మోహ‌న్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ సినిమాలో న‌య‌న‌తార న‌ట‌న‌కు ఈ ఏడాది ఫిలింఫేర్ ఉత్త‌మ‌న‌టి అవార్డును న‌య‌న‌తార సొంతం చేసుకుంది కూడా.

ప్ర‌స్తుతం స‌మాజంలో మ‌హిళ‌ల‌పై జ‌ర‌గుతున్న అకృత్యాల‌కు వ్య‌తిరేకంగా పోరాడే ఓ స్త్రీ క‌థాంశంతో వాసుకి సినిమా రూపొందింది. సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. మంచి కాన్సెప్ట్‌తో విడుద‌ల‌కు సిద్ధ‌మైన ఈ సినిమా తెలుగు శాటిలైట్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జీ తెలుగు ఫ్యాన్సీ ఆప‌ర్‌తో సొంతం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా శ్రీరామ్ సినిమా బ్యాన‌ర్ అధినేత శ్రీరామ్ జీటీవీ యాజ‌మాన్యానికి ధ‌న్య‌వాదాల‌ను తెలిపారు.

చిన్న సినిమాల‌కు శాటిలైట్ కావ‌డం లేదంటూ వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో 'వాసుకి' సినిమా శాటిలైట్ హ‌క్కులు అమ్ముడు కావ‌డంతో కంటెంట్ ఉన్న సినిమాకు శాటిలైట్ ఆద‌ర‌ణ ఉంటుంద‌ని నిరూప‌ణ అయ్యింది. బిజినెస్ ప‌రంగా సినిమాకు మంచి క్రేజ్ నెల‌కొంది. త్వ‌ర‌లోనే సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

విడుదలైన నితిన్ , హను రాఘవపూడి 14 రీల్స్ 'లై' టీజర్

యూత్ స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.

అఖిల్ పెళ్ళిపై రూమర్స్...

అక్కినేని అఖిల్..చేసింది ఒక సినిమా,అది కూడా ప్లాప్.

బాలీవుడ్ బాబా..

బాబా అంటే పకీర్ కాదులెండి..రజనీకాంత్ బాబా సినిమా గుర్తుండే ఉంటుంది.

మహాభారతానికి సంబంధమేంటి?

మన ఇతిహాసాల్లో మహాభారతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.

పుకార్లను ఖండిన టాలీవుడ్ జంట

పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన వరుణ్ సందేష్, వితిక శేరు రియల్ లైఫ్లో కూడా ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి గత ఏడాది ఆగస్టులో ఒకింటివారయ్యారు.