అక్టోబ‌ర్ 26న 'వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు' విడుద‌ల‌

  • IndiaGlitz, [Friday,October 05 2018]

వీర‌భోగ వ‌సంత‌రాయులు అక్టోబ‌ర్ 26న విడుద‌ల కానుంది. నారా రోహిత్, శ్రీయ‌స‌ర‌న్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంద్ర‌సేన తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతానికి విడుద‌ల తేదీ మాత్ర‌మే క‌న్ఫ‌ర్మ్ చేసిన ద‌ర్శ‌క నిర్మాత‌లు.. ట్రైల‌ర్ విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టించనున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఈ మ‌ధ్యే విడుద‌లైన వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్బుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.

దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో సాగుతున్న భిన్న‌మైన క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇది. హీరో హీరోయిన్ల ఫ‌స్ట్ లుక్స్ కు కూడా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ లుక్స్ సినిమాపై అంచ‌నాలు కూడా పెంచేసింది. మార్క్ కే రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఎస్ వెంక‌ట్ సినిమాటోగ్ర‌ఫీ హ్యాండిల్ చేస్తున్నాడు. బాబా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై అప్పారావు బెల్ల‌న వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటీనటులు: నారా రోహిత్, సుధీర్ బాబు,శ్రీయ సరన్ మరియు శ్రీవిష్ణు

More News

'రోషగాడు' థీమ్ సాంగ్ విడుదల

విజయ్ ఆంథోని నటిస్తొన్న తాజా చిత్రం "రోషగాడు". ఈ వైవిధ్యమైన హీరో తొలిసారి పవర్  ఫుల్ పొలీసాఫీసర్ పాత్రలో నటిస్తొన్న ఈ చిత్రానికి గణేష దర్శకుడు.

వ‌ర‌ల‌క్ష్మిని పొగుడుతున్నవిశాల్‌

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌కీ, విశాల్‌కీ మ‌ధ్య ఏదో జరుగుతుంద‌ని, ఎప్ప‌టికైనా వాళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌ని ఓ ప‌క్క కోలీవుడ్ కోడై కూస్తుంది.

ప్ర‌భాస్ ప్రేయ‌సికి డెంగ్యూ|

శ్ర‌ద్ధా క‌పూర్‌ని శ్ర‌ద్ధా క‌పూర్ అని అన‌డం క‌న్నా 'సాహో'లో ప్ర‌భాస్ ప్రేయ‌సి అనో, లేకుంటే వెండితెర‌మీద సైనా నెహ్వాల్ అనో అంటే అంద‌రూ త్వ‌ర‌గా గుర్తుప‌డ‌తారేమో.

క‌మ‌ల్‌.. మెచ్చుకున్నారు!

రొటీన్‌కి భిన్నంగా ఉండే సినిమాలు ఎప్పుడైనా ప్ర‌శంస‌లు పొందుతూనే ఉంటాయి. అందులోనూ స‌మాజంలో త‌క్కువ‌గా చూడ‌బ‌డే సామాజిక వ‌ర్గాల‌కు సంబంధించిన అంశాల‌ను రియ‌లిస్టిక్

శ్రుతి.. శ్రుతి చేస్తోంది!

క‌మ‌ల్ త‌న‌య శ్రుతి హాస‌న్ న‌టి కాక‌మునుపే మంచి సంగీత ద‌ర్శ‌కురాలు. సంగీతంలో వివిధ ఫార్మ్ ల‌పై ఆమెకు మంచి ప‌ట్టు ఉంది.