Dhanush: ధనుష్ "నేనే వస్తున్నా" చిత్రం నుండి "వీరా సూర ధీర రారా" పాట విడుదల

  • IndiaGlitz, [Wednesday,September 21 2022]

తమిళ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ 'నానే వరువెన్'. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే 'నానే వరువెన్' నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి.ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పిస్తుంది.నేనే వస్తున్నా పేరుతో ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది.

తాజాగా ఈ చిత్రం నుండి వీరా సూర ధీర రారా పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పాటను చంద్రబోస్ రచించారు.
వీరా సూర ధీర రారా
మతి బెదర
గతి చెదర
అడవంతా నీ అధికారం ఔరా
లాంటి లైన్స్ ధనుష్ కి ఎలివేషన్ తో పాటు ఆకట్టుకుంటున్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను రాహుల్ నంబియార్ ఆలపించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

“కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లుఅర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు.

నటీనటులు: ధనుష్, ఎల్లి అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, యోగిబాబు మరియు యోగిబాబు

More News

Karthikeya and Neha Shetty: కార్తికేయ, నేహా శెట్టి జంటగా 'బెదురులంక 2012' టైటిల్ ఖరారు

యువ హీరో కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా సినిమా రూపొందుతోంది.

Jeevitha Rajasekhar : జహీరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధిగా జీవితా రాజశేఖర్.. జోరుగా ఊహాగానాలు..?

తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోన్న భారతీయ జనతా పార్టీ ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Bigg Boss: బిగ్‌బాస్ రూల్స్ మార్చేసిన గీతూ.. నాగార్జునకే చురకలేసిన శ్రీసత్య

బిగ్‌బాస్ హౌస్‌లో గొడవలు లేవు.. జనాలకు సరైన కంటెంట్ దొరక్క బోర్ కొడుతుందంటూ హోస్ట్ నాగార్జున నుంచి విమర్శకుల

Gowri Kalyana Vaibhogame: ఒక్క పాట.. ఆరుగురు సింగర్స్.. దుమ్మురేపుతోన్న ‘‘గౌరీ కళ్యాణ వైభోగమే’’ సాంగ్

మనదేశంలో పెళ్లి పాటకు వుండే డిమాండే వేరు. వివిధ సినిమాల్లో సందర్భాన్ని బట్టి వచ్చే పాటలు పెళ్లి వేడుకల్లో,

'అహింస' ఫస్ట్ సింగిల్ 'నీతోనే నీతోనే' పాట విడుదల

క్రియేటివ్ జీనియస్ తేజ ప్రస్తుతం 'అహింస' అనే యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు.