close
Choose your channels

ప్రీమియర్ షోతో సూపర్ రెస్పాన్స్ అందుకున్న'వెంకటాపురం' సంతోషంలో యూనిట్ సభ్యులు

Thursday, May 11, 2017 • తెలుగు Comments

గుడ్ సినిమా గ్రూప్ బ్యాన‌ర్ మీద రాహూల్ మ‌హిమా మ‌క్వానా న‌టించగా శ్రేయాస్ శ్రీనివాస్ నిర్మించిన వెంక‌టాపురం సినిమా ఈనెల 12న విడుద‌ల కాబోతుంది. గురువారం  స్పెష‌ల్ ప్రీమియ‌ర్ షో వేసింది చిత్ర యూనిట్. ఈ షోకు మీడియానుంచే కాకుండా ప‌బ్లిక్ నుంచి కూడా సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. పోస్ట‌ర్ నుంచి ట్రైల‌ర్ వ‌ర‌కు ఎంత ఆశ‌క్తి రేపిందో సినిమా కూడా అంతే ఉత్కంఠ‌గా సాగిందంటూ రెస్పాన్స్ రావ‌డంతో యూనిట్ ఆనందంగా ఉంది. శుక్ర‌వారం నాడు వెంక‌టాపురం. 250కి పైగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కాబోతుంది.
 
ఎంగేజింగ్ స్క్రీన్ప్లేతో  వెంక‌టాపురం తెర‌కెక్కింది. సినిమాకు క‌థ‌నంతో పాటు సినిమాటోగ్రఫి ప్ల‌స్ అని చెపుతున్నారు. హ్య‌పీడేస్ ఫేం రాహూల్ ఈ సినిమాలో కొత్త లుక్ తో పాటు సిక్స్ ప్యాక్ చేసి ఆక‌ట్టుకున్నాడు. ముఖ్యంగా మెద‌టి భాగంలో వైజాగ్ విజువ‌ల్స్ హీరో, హీరోయిన్స్ మ‌ద్య వ‌చ్చే స‌న్నివేశాలు హ్రుద‌యాన్ని హ‌త్తుకునేలా ఆక‌ట్ట‌కొవ‌ట‌మే కాకుండా, మెద‌టి భాగంలో వ‌చ్చే ప్ర‌తి ప్ర‌శ్న‌కి స‌మాధానం సెకాంఢాఫ్ లో ద‌ర్శ‌కుడు క్లారిటి గా చెప్ప‌టం విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు కురుస్తున్నాయి.  ఈ శుక్ర‌వారం  వెంక‌టాపురం విజ‌యం ఖాయంగా క‌నిపిస్తుందని నిర్మాత అన్నారు

Get Breaking News Alerts From IndiaGlitz