close
Choose your channels

26 ఏళ్ల 'చంటి'

Wednesday, January 10, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిన్న‌ప్ప‌ట్నుంచి పాటలు, తల్లి, తల్లి ప్రేమ తప్ప మ‌రేమీ తెలియని ఒక అమాయకుడికి.. ఓ అమ్మాయి ప్రేమ అనుభ‌వంలోకి వ‌చ్చాక అత‌ని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనే పాయింట్‌తో తెర‌కెక్కిన చిత్రం చంటి`. టైటిల్ రోల్‌లో విక్టరీ వెంకటేష్ జీవించార‌నే చెప్పాలి. మీనా క‌థానాయిక‌గా నటించిన ఈ చిత్రం మ్యూజికల్ బ్లాక్ బస్టర్‌గా అప్పట్లో సంచలన విజయం సాధించింది. సుజాత, నాజర్, వినోద్, ప్రసన్న కుమార్, మంజుల, సుధారాణి, బ్రహ్మానందం తదితరులు ఇత‌ర ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వ‌హించారు. 40 డైరెక్ట్ సెంటర్లలో 100 రోజులు ప్రదర్శించబడి అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ చిత్రం.

ఇళయరాజా స్వరపరచిన ప్రతీపాట శ్రోతలను అలరించింది. బాలు, చిత్ర గళాన.. వేటూరి, సాహితీ కలాలనుంచి జాలువారిన ఈ పాటలు ఇప్ప‌టికీ తెలుగునాట వినిపిస్తూనే ఉంటాయి. “పావురానికి పంజరానికి” పాటకిగానూ బాలు ఉత్తమ గాయకుడిగా అవార్డుని కూడా పొందారు. తమిళంలో చిన్నతంబి`గా రూపొందిన సినిమాకి రీమేక్‌గా కె.ఎస్.రామారావు ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో చంటి పాత్రకి ముందుగా రాజేంద్ర ప్రసాద్ ని అనుకున్నారట. కాని తమిళ్‌లో హిట్ అయిన తర్వాత ఈ సినిమాకి వెంకటేష్ అయితే బాగుంటుందని నిర్మాత ఫిక్స్ అయ్యారట. హిందీలోనూ వెంక‌టేష్ క‌థానాయకుడిగా అనారి` పేరుతో రీమేక్ అయిన ఈ సినిమా.. అక్క‌డా మంచి విజ‌యం సాధించింది. జనవరి 10, 1992న‌ విడుదలైన చంటి`.. నేటితో 26 ఏళ్ళు పూర్తిచేసుకుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.