close
Choose your channels

వెంకటేష్ 'దృశ్యం 2' ప్రారంభం

Tuesday, March 2, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విక్టరీ వెంకటేష్‌, మీనా జంటగా న‌టించిన `దృశ్యం` సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందోఅందరికీ తెలిసిందే. మ‌ళ్లీ విక్టరీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా దృశ్యం సినిమాకి సీక్వెల్‌గా `దృశ్యం 2` వ‌స్తోంది. దృశ్యం, దృశ్యం 2 ఒరిజిన‌ల్ మ‌ళ‌యాల వెర్ష‌న్ డైరెక్ట్ చేసిన జీతు జోసెఫ్ ఈ మూవీతో తెలుగు ప‌రిశ్ర‌మ‌కి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రై.లి, ఆశిర్వాద్ సినిమాస్‌, రాజ్‌కుమార్ థియేట‌ర్ ప్రై.లి ప‌తాకాల‌పై డి. సురేష్‌బాబు, ఆంటోని పెరుంబ‌వూర్‌, రాజ్‌కుమార్ సేతుప‌తి నిర్మిస్తున్నారు.

ఈ మూవీ హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాల‌తో ప్రారంభ‌మైంది. విక్టరీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో న‌దియ‌, న‌రేష్‌, ఏస్త‌ర్ అనిల్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండ‌గా స‌తీష్ కురూప్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చి 5 నుండి ప్రారంభంకానుంది.

విక్టరీ వెంక‌టేష్‌, మీనా, న‌దియా, న‌రేష్‌, ఏస్త‌ర్ అనిల్ త‌దిత‌రులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.