తార‌క్ ట్వీట్‌కు వెంకీ ఫన్నీ రీ ట్వీట్‌

  • IndiaGlitz, [Wednesday,April 22 2020]

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతోన్న ఛాలెంజ్ ‘బీ ద రియ‌ల్ మేన్‌’. క్వారంటైన్ టైమ్‌లో ఇంట్లోని మ‌హిళ‌ల‌కు చేదోడు వాదోడుగా ఉండాల‌ని సందీప్ వంగా విసిరిన ఛాలెంజ్‌లో ముందు రాజ‌మౌళి త‌ర్వాత తార‌క్‌, చ‌ర‌ణ్‌, కీర‌వాణి, కొర‌టాల శివ‌, సుక‌మార్ త‌దిత‌రులు పాల్గొన్నారు. వీరు మ‌రి కొంద‌రిని నామినేట్ చేశారు. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ నామినేట్ చేసిన బాల‌కృష్ణ‌, చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేశ్‌ల‌లో చిరంజీవి ముందుగా ఛాలెంజ్‌కు ఓకే చెప్పారు. ఇప్పుడు విక్ట‌రీ వెంక‌టేశ్ ట్విట్ట‌ర్ ద్వారా రెస్పాండ్ అయ్యారు. ‘‘తారక్ నేను ఛాలెంజ్‌కు నేను సిద్ధం. కానీ ముందు మా గ్యాంగ్ లీడ‌ర్ చిరంజీవిగారి వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం’’ అన్నారు.

వెంకటేశ్ చిరంజీవిని తమ గ్యాంగ్ లీడర్ అని సంబోధిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. వారికి న‌చ్చిన ప‌నుల‌ను చేస్తున్నారు. ఈ త‌రుణంలో బీ ద రియ‌ల్‌మేన్ ఛాలెంజ్ ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది. స్టార్స్ అంద‌రూ ఉత్సాహంగా పాల్గొంటుండటంతో అంద‌రూ ఆస‌క్తిగా ఈ ఛాలెంజ్ కోసం ఎదురుచూస్తున్నారు. క్ర‌మంగా ఈ ఛాలెంజ్‌లో మ‌రికొంత మంది స్టార్స్ చేరుతున్నారు. ఇక వెంక‌టేశ్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న క‌రోనా వైర‌స్ స‌మ‌యంలో క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం, దీపాలు వెలిగించి సంఘీభావాన్ని తెలియ‌జేసే కార్య‌క్ర‌మాల్లోనూ ఆయ‌న చురుగ్గా పాల్గొన్నారు.

More News

నిరూపిస్తే రాజధాని సెంటర్‌లో ఉరేసుకుంటా: వైసీపీ ఎమ్మెల్యే

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ విజృంభిస్తోంది. ఈ తరుణంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి.

చిల్లర రాజకీయాలకు ఆపి.. క్షమాపణ చెప్పండి : పవన్

రోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం నెలకొన్న సంగతి తెలిసిందే.

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రాజశేఖర్ కుమార్తెల విరాళం రూ.2 లక్షలు

ఈ రోజు ఉదయం అక్కాచెల్లెళ్లు ఇద్దరూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)తో సమావేశం అయ్యారు. ఆయనకు చెక్స్ అందజేశారు.

కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన చరణ్‌దీప్

'బాహుబలి'లో కాలకేయ తమ్ముడిగా, వరుణ్ తేజ్ 'లోఫర్' సినిమాలో విలన్‌గా, 'సైరా నరసింహారెడ్డి', 'పీఎస్వీ గరుడవేగ', 'కల్కి' చిత్రాల్లో కీలక పాత్రల్లో

తెలంగాణ: వెయ్యికి చేరువలో కరోనా కేసులు

కరోనా మహమ్మారి తెలంగాణలో రోజురోజుకూ విజృంభిస్తోంది. రోజురోజుకూ నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తున్న రాష్ట్ర ప్రజలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు.