సూపర్ స్టార్ రజినీకాంత్ `పెద్దన్న` టీజర్‌ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అన్నాత్తె తెలుగులో పెద్ద‌న్న పేరుతో రాబోతుంది. అన్నాత్తై సినిమా తెలుగు రైట్స్‌ను టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏషియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తాజాగా పెద్ద‌న్న టీజ‌ర్‌ను ఈ రోజు (అక్టోబర్ 23) విక్టరీ వెంకటేష్ విడుద‌ల‌చేశారు.

ఈ టీజర్ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇందులో మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉన్నాయి. డైలాగ్స్, యాక్షన్స్ సీక్వెన్స్, రజినీ మార్క్ స్టైల్‌తో రాబోతోన్న ‘పెద్దన్న’ టీజర్ సినిమాపై అంచనాల‌ను మ‌రింత‌ పెంచింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా టీజర్ సైతం అందరినీ ఆకట్టుకుంటోంది. డి ఇమ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ మెప్పించేలా ఉంది.

శివ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార నటిస్తోంది. మీనా, కుష్బూ, కీర్తి సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తుండ‌గా వెట్రి సినిమాటోగ్రఫర్‌గా, రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
పెద్ద‌న్న సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న అత్యధిక‌ థియేటర్స్‌ల‌లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

More News

బిగ్‌బాస్ 5 తెలుగు: యానీ మాస్టర్‌కు సన్నీ ఘాటు ముద్దు... రవి ఆశలు గల్లంతు, ప్రియాంకకు విశ్వ వార్నింగ్

కెప్టెన్సీ టాస్క్ వల్ల గత కొన్ని రోజులుగా ఇంటి సభ్యుల మధ్య ఏర్పడిన గ్యాప్‌ని తొలగించేందుకు బిగ్‌బాస్ యత్నించారు.

వ్యాక్సినేషన్‌ సెంచరీ: మీ శ్రమ వల్లే ఇదంతా... ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి రామ్‌‌చరణ్‌ కృతజ్ఞతలు

అగ్రరాజ్యాలకే సాధ్యం కానీ అసాధ్యాన్ని భారతదేశం ఇటీవల 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

దీపావళికి కానుకగా 'జీ 5' ఓటీటీలో సూపర్ హిట్ 'శ్రీదేవి సోడా సెంటర్' విడుదల

వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు... ఏవి కావాల‌న్నా వీక్ష‌కులు ముందుగా చూసే ఓటీటీ వేదిక 'జీ 5'.

రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ దర్శకత్వంలో వివాదాస్పద సినిమా 'దహిణి'

తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ తెరకెక్కించిన సినిమా 'దహిణి'.

మంచు విష్ణు చేతులు మీదుగా విడుద‌లైన రావ‌ణ‌లంక ట్రైల‌ర్

రియ‌ల్ ఎస్టేట్‌ రంగంలో ఎంతోమందికి ఉపాధి క‌ల్పించి వ్యాపార‌వేత్త‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సాధించి,