close
Choose your channels

వెంకీ, నానిల మల్టీస్టారర్.. ప్రొడ్యూసర్‌గా సురేశ్ బాబు!

Wednesday, December 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వెంకీ, నానిల మల్టీస్టారర్.. ప్రొడ్యూసర్‌గా సురేశ్ బాబు!

తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలకు విక్టరీ వెంకటేశ్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్‌తో ‘గోపాల గోపాల’, వరుణ్ తేజ్‌తో ‘ఎఫ్2’, రామ్‌తో ‘మసాలా’.. ఇప్పుడు తన మేనల్లుడితో ‘వెంకీ మామ’. కథ నచ్చితే చాలు సినిమా చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు వెంకీ. తాజాగా మరో మల్టీస్టారర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. వెంకటేశ్ సోదరుడు, ప్రొడ్యూసర్ సురేశ్ బాబుకు రచయిత ఆకుల శివ ఓ కథ చెప్పారట. ఆ కథకు వెంకీతో పాటు మరో యంగ్ హీరో ఉంటే బాగుంటుందని అన్నాడట. కథ నచ్చిన సురేశ్ బాబు.. వెంకటేశ్‌కు జోడీని వెతికే పనిలో పడ్డారని సమాచారం.

అయితే, వెంకటేశ్‌తో నేచురల్ స్టార్ నాని అయితే బాగుంటుందని సురేశ్ భావిస్తున్నారట. నాని ప్రస్తుతం ‘వీ’, ‘టక్ జగదీష్’ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత వెంకీతో కలిసి సినిమా చేసే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ టాక్. మరోవైపు వెంకీ మామ తర్వాత వెంకటేశ్ ..తమిళ సూపర్ డూపర్ హిట్ ‘అసురన్’ తెలుగు రిమేక్ చేసే పనిలో పడ్డారు. ఆ సినిమా పూర్తైన తర్వాత.. 2021లో నానితో సినిమా చేయనున్నారని తెలుస్తోంది.

ఇదివ‌ర‌కు నాని కూడా నాగార్జున‌తో క‌లిసి దేవ‌దాస్ అనే మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. క‌థ న‌చ్చితే నాని మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల్లో నటించ‌డానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. కాబ‌ట్టి క‌థ ప‌రంగా అన్ని ఓకే అయితే ఈ కాంబోను మ‌నం తెర‌పై చూసేయ‌వ‌చ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.