close
Choose your channels

‘నారప్ప’ రిలీజ్ ఎప్పుడంటే‌..?

Tuesday, August 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘నారప్ప’ రిలీజ్ ఎప్పుడంటే‌..?

సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేశ్ ప్ర‌స్తుతం త‌మిళ చిత్రం ‘అసుర‌న్‌’ తెలుగులో రీమేక్ ‘నార‌ప్ప‌’లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి వెంక‌టేశ్ జ‌త‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్ ఏపిసోడ్‌లో మ‌రో హీరోయిన్ కూడా క‌నిపించ‌నుంద‌ట‌. మ‌రి ఆ హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. క‌రోనా ఎఫెక్ట్ పూర్తిగా త‌గ్గిన త‌ర్వాతే అంటే వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలోనే ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసే ఆలోచ‌న‌లో చిత్ర యూనిట్ ఉంద‌ట‌. సినిమాను వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ని టాక్‌. ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో రావాల్సిన ఈ చిత్రం క‌రోనా పుణ్య‌మాని వ‌చ్చే ఏడాది వేసవికి వెళ్లిపోయింది.

భూవివాదాలు, కుల వివ‌క్ష‌ల‌ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా కు సంబంధించిన కీల‌కమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను పీట‌ర్ హెయిన్స్ నేతృత్వంలో త‌మిళ‌నాడులోని కురుములై ప్రాంతంలో చిత్రీక‌రించారు. డి.సురేష్‌బాబు, క‌లైపులి థాను ఈ చిత్రానికి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.