close
Choose your channels

‘ఎఫ్ 3’..షూటింగ్ హైద‌రాబాద్‌లో తిరిగి ప్రారంభం

Friday, September 17, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘ఎఫ్ 3’..షూటింగ్ హైద‌రాబాద్‌లో తిరిగి ప్రారంభం

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వచ్చిన `ఎఫ్ 2` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో `ఎఫ్ 3` సినిమా రాబోతోంది. ఇప్పటికే శర వేగంగా సినిమాను పూర్తి చేసేందుకు చిత్రయూనిట్ ప్రణాళిక వేసింది.

ఎంట‌ర్‌టైన్‌మెంట్ చిత్రాలను తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. సినిమా సినిమాకి త‌న గ్రాఫ్‌ని పెంచుకుంటూ సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్‌బాబు `సరిలేరు నీకెవ్వరు`తో కలెక్షన్ల వర్షం కురిపించారు అనిల్ రావిపూడి. ఇక ఎఫ్ 2 సినిమాతో నవ్వుల వర్షం కురిపించిన అనిల్ రావిపూడి..ఎఫ్ 3తో మరోసారి నవ్వించేందుకు రాబోతోన్నారు. టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘ఎఫ్ 3’..షూటింగ్ హైద‌రాబాద్‌లో తిరిగి ప్రారంభం

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి మ‌రియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వ‌రస విజ‌యాల‌తో మంచి ఫామ్‌లో ఉన్నారు. సీనియర్ మరియు యంగ్ హీరో కలిసి F2తో అందించిన వినోదం ప్రేక్షకుల‌హృద‌యాల్లో ఎప్ప‌టికీ నిలిచే ఉంటుంది.

ఈ చిత్రం మీదున్న అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఆసాంతం నవ్వుల ఝల్లు కురిపించేలా అనిల్ రావిపూడి స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఎఫ్ 3 చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు ప్రత్యేకమైన మ్యానరిజంలు, బాడీ లాంగ్వేజ్‌లను క్రియేట్ చేశారు. తమన్నా, మెహ్రీన్‌లు వెంకటేష్, వరుణ్ తేజ్ స‌ర‌స‌న హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోన్నారు.

‘ఎఫ్ 3’..షూటింగ్ హైద‌రాబాద్‌లో తిరిగి ప్రారంభం

తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ హైద్రాబాద్‌లో నేడు (శుక్రవారం) ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిత్ర తారాగణం అంతా పాల్గొననున్నారు. మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఇందులో నటీనటులు, టెక్నీషియన్స్ అందరి మొహాలపై చిరునవ్వుతో సెట్ అంతా కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది.

ఎఫ్ 2 సినిమాలో దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఆల్బమ్ ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అంతకు మించి అనేలా.. ఎఫ్ 3 కోసం స్పెషల్ ట్యూన్లను దేవీ శ్రీ ప్రసాద్ సిద్దం చేశారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నటీనటులు : వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సునీల్ తదితరులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.