మోహ‌న్‌లాల్‌తో వెంక‌టేష్‌?

  • IndiaGlitz, [Saturday,November 18 2017]

కంటెంట్ న‌చ్చితే చాలు.. జయాపజయాలను, స్టార్ డమ్‌ని కూడా పట్టించుకోని క‌థానాయ‌కుడు విక్టరీ వెంకటేష్. స‌బ్జెక్ట్ డిమాండ్ చేస్తే.. మల్టీ స్టారర్ మూవీ చేయడానికి కూడా వెనకాడరాయ‌న‌. ఇప్ప‌టికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ ల‌తో ఈ త‌ర‌హా సినిమాలు చేశారు వెంకీ. ఇప్పుడు మ‌రో స్టార్‌తో ఆయ‌న తెర‌ని పంచుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే.. ఈ సారి తెలుగు స్టార్‌తో కాదు.. మ‌ల‌యాళ స్టార్ హీరోతో ఆయ‌న స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న ఓ మ‌ల‌యాళ సినిమాలో ఓ కీల‌క పాత్ర చేసేందుకు వెంక‌టేష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని మాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇందులో త‌న పాత్ర వినూత్నంగా ఉండ‌డంతో వెంకీ వెంట‌నే ఓకే చెప్పార‌ని తెలిసింది. ఒక‌వేళ ఈ సినిమా కార్యరూపం దాలిస్తే.. వెంకీ అభిమానుల‌కు అది శుభ‌వార్తే. ఇప్ప‌టికే మోహ‌న్‌లాల్ చిత్రాల‌తో జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌కాంత్ మాలీవుడ్‌లోకి ఎంట‌ర్ అయ్యారు. మోహ‌న్‌లాల్‌, వెంకీ సినిమాకి సంబంధించిన అధికారిక వార్త త్వ‌ర‌లోనే వెల్ల‌డ‌వుతుంద‌ని మాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

More News

రాజ్‌త‌రుణ్‌ని న‌మ్మిన నాగార్జున‌

టాలీవుడ్‌లో తక్కువ టైంలోనే మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో రాజ్ తరుణ్. అలాగే తనకంటూ అభిమానులను కూడా సంపాదించుకున్నాడు ఈ యువ క‌థానాయ‌కుడు. కాగా, రాజ్ త‌రుణ్  నటించిన 'రాజుగాడు', 'రంగుల రాట్నం' చిత్రాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.

డబుల్ బొనాంజా ఇవ్వబోతున్న నాగశౌర్య

'జ్యో అచ్యుతానంద' త‌రువాత ఏడాది గ్యాప్‌తో యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య సంద‌డి చేసిన చిత్రం 'కథలో రాజకుమారి'. నారా రోహిత్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో నాగ‌శౌర్య గెస్ట్ రోల్ చేశాడు.

సుమంత్ సినిమాకి మంచి ప్రీ-రిలీజ్ మార్కెట్

చాలా కాలం నుంచి హిట్ కోసం పరితపిస్తున్నకథానాయకుడు సుమంత్. ఈ మధ్య కాలంలో మంచి డీసెంట్ ఫిలిమ్స్ చేసినా.. అవన్నీ సుమంత్ కి హిట్ ని అందించలేకపోయాయి. అయితే ప్రస్తుతం సుమంత్ కి ఆనందాన్నిచ్చే విషయం ఒకటి ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న హెచ్ బి డి చిత్రం

లాగిన్ మీడియా బ్యానర్లో మేఘన, సంతోషి శర్మ, సల్మాన్, హిమాజ, మానస, అజయ్ తదితరులు నటిస్తున్న హెచ్ బి డి( హ్యాకెడ్ బై డెవిల్) చిత్రానికి దర్శకుడు కృష్ణ కార్తిక్ కాగా నిర్మాత వై. ఉదయ్ కుమార్ గౌడ్.

అనుష్క భాగమతి రిలీజ్ డేట్

టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క నటించిన తాజా తెలుగు చిత్రం భాగమతి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది.