close
Choose your channels

సంక్రాంతి బరిలో వెంకీ మామ?

Tuesday, October 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సంక్రాంతికి పోటీకి సై అంటారా?

నిజ జీవితంలో మామా అల్లుడు అయిన వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య అక్కినేని క‌లిసి న‌టిస్తోన్న తాజా చిత్రం `వెంకీమామ‌`. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. నిన్న‌టి వ‌ర‌కు ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు వినిపించాయి. అయితే తాజా సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌.

నిజానికి క్రిస్మ‌స్ కానుక‌గా `వెంకీమామ‌`ను విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. అయితే..డిసెంబ‌ర్ 20న బాల‌కృష్ణ 105వ చిత్రం, ర‌వితేజ `డిస్కోరాజా` చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. దీంతో పాటు మ‌రికొన్ని చిత్రాలు కూడా పోటీ ప‌డ‌తాయి. కాబ‌ట్టి ఈ పోటీలో సినిమా ఎందుక‌ని అనుకున్నారేమో ద‌ర్శ‌క నిర్మాత‌లు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే జ‌న‌వ‌రి 10న ర‌జ‌నీకాంత్ ద‌ర్బార్‌, జ‌న‌వ‌రి 12న మ‌హేష్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`, అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో..` సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. అలాగే జ‌న‌వ‌రి 14న క‌ల్యాణ్ రామ్ `ఎంత మంచివాడ‌వురా` విడుద‌ల‌వుతుంది. ఈ గ్యాప్‌లో అంటే జ‌న‌వ‌రి 11న `వెంకీమామ‌`ను విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల తేదీపై ఓ క్లారిటీ రానుంది.

కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో డి.సురేష్‌బాబు, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.