సంక్రాంతి బరిలో వెంకీ మామ?

  • IndiaGlitz, [Tuesday,October 15 2019]

నిజ జీవితంలో మామా అల్లుడు అయిన వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య అక్కినేని క‌లిసి న‌టిస్తోన్న తాజా చిత్రం 'వెంకీమామ‌'. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. నిన్న‌టి వ‌ర‌కు ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు వినిపించాయి. అయితే తాజా సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌.

నిజానికి క్రిస్మ‌స్ కానుక‌గా 'వెంకీమామ‌'ను విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. అయితే..డిసెంబ‌ర్ 20న బాల‌కృష్ణ 105వ చిత్రం, ర‌వితేజ 'డిస్కోరాజా' చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. దీంతో పాటు మ‌రికొన్ని చిత్రాలు కూడా పోటీ ప‌డ‌తాయి. కాబ‌ట్టి ఈ పోటీలో సినిమా ఎందుక‌ని అనుకున్నారేమో ద‌ర్శ‌క నిర్మాత‌లు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే జ‌న‌వ‌రి 10న ర‌జ‌నీకాంత్ ద‌ర్బార్‌, జ‌న‌వ‌రి 12న మ‌హేష్ 'స‌రిలేరు నీకెవ్వ‌రు', అల్లు అర్జున్ 'అల వైకుంఠ‌పుర‌ములో..' సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. అలాగే జ‌న‌వ‌రి 14న క‌ల్యాణ్ రామ్ 'ఎంత మంచివాడ‌వురా' విడుద‌ల‌వుతుంది. ఈ గ్యాప్‌లో అంటే జ‌న‌వ‌రి 11న 'వెంకీమామ‌'ను విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల తేదీపై ఓ క్లారిటీ రానుంది.

కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో డి.సురేష్‌బాబు, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

More News

కోలీవుడ్‌లో క్రికెట‌ర్స్‌

ఇప్పుడు ఇండియ‌న్ క్రికెట‌ర్స్ అంద‌రూ కోలీవుడ్‌లో న‌టిస్తున్నారు. వీరు న‌టించ‌బోయే సినిమాల‌న్నీ అధికారికంగా క‌న్‌ఫ‌ర్మ్ అయ్యాయి.

మ‌రోసారి అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్న నిర్మాత‌

నిర్మాత కె.కె.రాధామోహ‌న్ ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మించినా ఈయ‌న‌కు ల‌క్ క‌లిసి రావ‌డం లేదు.

రీమేక్స్‌పై మ‌న‌సుప‌డుతున్న రామ్‌

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఈ ఏడాది `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో చాలా పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

బీసీసీఐ గంగూలీకి సీఎం దీదీ అభినందనలు!

బీసీసీఐ అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ నామినేషన్‌ వేసిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్‌ హీరోయిన్స్‌లో టాప్ రెమ్యునరేషన్ ఎవరికంటే..

బాలీవుడ్‌‌ నటీమణుల రెమ్యునరేషన్‌‌ గురించి సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అసలు బాలీవుడ్‌లో టాప్‌లో ఉన్న హీరోయిన్లెవరు..?