'వెంకీ మామ' రిలీజ్ డేట్ ?

  • IndiaGlitz, [Friday,November 15 2019]

విక్ట‌రీ వెంక‌టేశ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య, రాశీఖన్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'వెంకీమామ‌'. ఈ సినిమా విడుద‌లపై ఓ స్ప‌ష్ట‌త రాలేదు. అప్పుడు విడుద‌ల‌వుతుంది.. ఇప్పుడు విడుద‌ల‌వుతుందంటూ వార్త‌లు విన‌ప‌డుతూనే ఉన్నాయి. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమా విడుద‌ల విష‌యంలో నిర్మాత‌ల్లో ఒక‌రైన డి.సురేష్‌బాబుకి ఓ క్లారిటీ వ‌చ్చింద‌ట‌. ఓ నెల పాటు ఈ సినిమాను ఎప్పుడు విడుద‌ల చేయాల‌నే దానిపై చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. చివ‌ర‌కు సినిమాను డిసెంబ‌ర్ 13న విడుద‌ల చేయ‌డానికి డి.సురేష్‌బాబు నిర్ణ‌యించుకున్నార‌ని టాక్‌.

రియ‌ల్ లైఫ్‌లో మామ అల్లుళ్లైన వెంకటేశ్‌, నాగ‌చైత‌న్య రీల్‌పై కూడా మామ, అల్లుడుగా అల‌రించ‌బోతున్నారు. వెంక‌టేశ్ రాజ‌మండ్రి ప‌క్క నుండే మోతుబ‌రి రైతు పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతుండ‌గా చైత‌న్య సైన్యంలో ప‌నిచేసే యువ‌కుడిగా క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. టైటిల్ సాంగ్ విడుద‌లైంది. శ‌నివారం ఎన్నాళ్ల‌కో.. అనే రెట్రో సాంగ్ కూడా విడుద‌ల కానుంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, డి.సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌కుడు.

More News

డ‌బ్బింగ్ షురూ చేసిన రజినీకాంత్

త‌లైవా.. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న `ద‌ర్బార్‌` చిత్రానికి సంబంధించిన డ‌బ్బింగ్ చెప్ప‌డం మొద‌లు పెట్టేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

దుబాయ్, కువైట్‌ నుంచి వస్తూ.. ఇవి తీసుకొచ్చారో జైలుకే!

అవును మీరు వింటున్నది నిజమే.. పొరపాటున కూడా ఇంటికొచ్చే టైమ్‌లో చిరుధాన్యాలను (కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఉధలు, అరికెలు) తీసుకురావొద్దు. ఒకవేళ తీసుకొచ్చారో అంతే సంగతులు.. అరెస్ట్ తప్పదు..

స్పీడు మీదున్న విశాల్‌

యాక్ష‌న్ హీరోగా పేరు తెచ్చుకున్న విశాల్ ఈ శుక్ర‌వారం 'యాక్ష‌న్‌' అనే చిత్రంతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. కాగా.. ప్ర‌స్తుతం ఈ హీరో బ్రిస్టోల్‌లో ఉన్నాడు.

కార్తీ లేటెస్ట్‌ ఎమోషనల్‌ మూవీ ‘దొంగ’

యాంగ్రీ హీరో కార్తీ ఇటీవల విడుదలైన ‘ఖైదీ’ చిత్రంతో ఎమోషనల్‌ హిట్‌ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘దొంగ’గా మరో ఘనవిజయాన్ని అందుకునేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కార్తీ.

చిరూ.. ‘పునాదిరాళ్ల’కు వచ్చిన పుట్టెడు కష్టాన్ని పట్టించుకోరూ..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలకు చేరి ఇప్పుడు మెగాస్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారు కొణిదెల చిరంజీవి. ఈయన ఇప్పటి వరకూ 151 సినిమాలు పూర్తి చేసుకున్నప్పటికీ..