'వెన్నెల్లో హాయ్ హాయ్ ' రిలీజ్ డేట్....

  • IndiaGlitz, [Sunday,January 31 2016]

సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం వెన్నెల్లో హాయ్ హాయ్'. అజ్మల్, నిఖిత నారాయణ్ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని డి.వి.సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేష్ నిర్మించారు. ఫిభ్రవరి 5న సినిమా విడుదల కానుంది. నిజానికి గతేడాదే సినిమా విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాలు వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. చక్కటి కుటుంబ విలువలతో మేళవింపుతో తెరకెక్కించిన అందమైన ప్రేమకథా చిత్రమిది. వంశీ మార్క్ కామెడీతో ఆద్యంతం ఆకట్టుకుంటుందని నిర్మాత తెలియజేశారు.

ఈ చిత్రానికి కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి, మాటలు: చందు, కెమెరా: యం.వి.రఘు, ఆర్ట్: రవీంద్రనాథ్ ఠాగూర్, కొరియోగ్రఫీ: స్వర్ణ, పాటలు: ప్రవీణ్ లక్మ, సంగీతం: చక్రి, సమర్పణ: నిఖితశ్రీ, నిర్మాత: డి. వెంకటేష్, దర్శకుడు: వంశీ.

More News

ఫిభ్రవరి 12న విడుదలవుతున్న 'కృష్ణగాడి వీరప్రేమగాథ'

ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యంగ్ హీరో నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'.

'నిన్నే కోరుకుంటా' ఆడియో విడుదల

సందీప్, విజయ్ భాస్కర్, ఆనంద్, పూజిత, సారిక పావని హీరో హీరోయిన్లుగా శుభకరి క్రియేషన్స్ బ్యానర్పై గణమురళి శరగడం దర్శకత్వంలో మరిపి విద్యాసాగర్(వినయ్) నిర్మిస్తున్న చిత్రం నిన్నే కోరుకుంటా. ప్రణవ్ మ్యూజిక్ అందించిన ఈసినిమా పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం విడుదలైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తూరుపు జగ్గారెడ్డి బిగ్

సుప్రీమ్ కి సూపర్ బిజినెస్..

మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్. ఈ చిత్రాన్ని పటాస్ ఫేం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

50 కోట్ల షేర్ క్రాస్ చేసినందుకు చాలా ఆనందంగా వుంది: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పి పతాకంపై భారీ చిత్రాల నిర్మాత 'ఛత్రపతి' ప్రసాద్ నిర్మించిన 'నాన్నకు ప్రేమతో..' సంక్రాంతికి విడుదలై సూపర్హిట్ అయింది.

ఫిభ్రవరి 12న 'కృష్ణగాడి వీరప్రేమగాథ'

ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యంగ్ హీరో నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’.