close
Choose your channels

విశాల్‌ ప్రాంతీయతపై నడిగర్ సంగంలో రచ్చ

Tuesday, June 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విశాల్‌ ప్రాంతీయతపై నడిగర్ సంగంలో రచ్చ

ఏం.. తెలుగు వాళ్లు ప‌నికి రారా? మ‌నం ఎక్క‌డున్నాం?  భార‌త దేశంలో లేమా? ఇక్క‌డ ప్రాంతీయ త‌త్వం ఏంటి? ఎవ‌రిని ప్ర‌జ‌లు ఎక్క‌డ అభిమానిస్తారో అక్క‌డ న‌టిస్తారు. రాణిస్తారు. విశాల్ తెలుగువాడైన‌ప్ప‌టికీ త‌మిళ ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌కు మంచి మార్కెట్ ఉంది. అక్క‌డ రాణిస్తున్నారు. న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లోనూ, పోయిన సారి నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌ల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఆయ‌న త‌మిళంలో నిర్మాత కూడా. అక్క‌డి వారికి అవ‌కాశాలిచ్చి, అక్క‌డ ప‌న్నులు క‌ట్టి, అక్క‌డి రైతుల‌కు త‌న లాభాల‌నుంచి డ‌బ్బుల‌ను పంచిన వ్య‌క్తి తెలుగువాడ‌ని స‌గ‌టు భార‌తిరాజాలాంటి సీనియ‌ర్ డైర‌క్ట‌ర్ల‌కు అప్పుడెందుకు గుర్తుకురాలేదు. తెలుగు న‌టుడు ఇలాంటి ప‌నులు చేస్తున్నాడ‌ని, ఆ లాభాల‌ను ఎవ‌రూ ఆశించ‌వ‌ద్ద‌ని ఎందుకు అన‌లేక‌పోయారు?  తీరా ఇప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే, త‌మిళ వాళ్లు గెల‌వాల‌నుకున్న‌ప్పుడు మాత్రం విశాల్ తెలుగువాడ‌ని గుర్తుకొచ్చాడా?

పోయిన సారి ఎన్నిక‌ల్లో ఇదే విశాల్ ను తెలుగు రెడ్డి అని రాధిక తూల‌నాడింది. ఏం ఆవిడ తెలుగు సినిమాలు చేయ‌లేదా?  తెలుగువారి ద‌గ్గ‌ర పారితోషికాన్ని తీసుకోలేదా?  అయినా సినిమా భాష‌ల వారిగా, ప్రాంతీయం వారిగా విడిపోక ముందు న‌డిగ‌ర్ సంఘంలో ద‌క్షిణాది న‌టీన‌టులంద‌రూ స‌భ్యులే. అక్క‌డ భాష‌ల‌కు ప్ర‌మేయం లేదు. ఇప్పుడు ఎవ‌రికి వారు విడిపోయిన త‌ర్వాత అక్క‌డ త‌మిళులే ఉండాల‌ని మాట్లాడుతున్నారు. తాజాగా విశాల్‌పై భాషా ప‌రంగా దాడి జ‌రుగుతున్న‌ది కూడా అందుకే. భార‌తిరాజాను తెలుగువారు ఆద‌ర్శ‌ప్రాయుడిగా గుర్తిస్తారు. ఆయ‌న సినిమాల్లోని నైపుణ్యాన్ని ఆరాధిస్తారు. అలాంటి ద‌ర్శ‌కుడు కూడా సంకుచిత మ‌న‌స్త‌త్వంతో మాట్లాడ‌టం బాధాక‌రం. క‌ళ‌ల‌కు భాషాభేదం లేద‌ని ఓవైపు చెబుతూనే, మ‌రోవైపు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాదు... అంటూ ఫిల్మ్ న‌గ‌ర్‌లో ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఆయ‌న మాట‌ల‌కు తెలుగు లెజండ‌రీ న‌టులు, చిత్ర ప‌రిశ్ర‌మ‌, `మా` ఎలా స్పందిస్తుందో చూడాలి.

న‌డిగ‌ర్ సంఘం త‌మిళుల సొమ్మేనా?   అది క‌ళాకారులంద‌రిదీ కాదా?  అనే ప్ర‌శ్న మొద‌లైంది. స‌మాధానం ఎవ‌రు చెబుతారో, విశాల్ ఎలా స్పందిస్తారోచూడాలి. అస‌లు త‌మిళ‌నాడుకు, ద‌క్షిణాదికి ఏ మాత్రం సంబంధం లేని నాయిక‌లు ఎంతో మంది స‌భ్య‌త్వ రుసుము క‌ట్టి అక్క‌డ స‌భ్య‌త్వాన్ని తీసుకున్నారు. విశాల్‌నే అంత తేలిగ్గా తీసిపారేసిన భార‌తిరాజాలాంటివాళ్లు, ఈ నాయిక‌ల‌కు ఎలాంటి గౌర‌వాన్నిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదేమో.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.