విశాల్‌ ప్రాంతీయతపై నడిగర్ సంగంలో రచ్చ

  • IndiaGlitz, [Tuesday,June 18 2019]

ఏం.. తెలుగు వాళ్లు ప‌నికి రారా? మ‌నం ఎక్క‌డున్నాం?  భార‌త దేశంలో లేమా? ఇక్క‌డ ప్రాంతీయ త‌త్వం ఏంటి? ఎవ‌రిని ప్ర‌జ‌లు ఎక్క‌డ అభిమానిస్తారో అక్క‌డ న‌టిస్తారు. రాణిస్తారు. విశాల్ తెలుగువాడైన‌ప్ప‌టికీ త‌మిళ ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌కు మంచి మార్కెట్ ఉంది. అక్క‌డ రాణిస్తున్నారు. న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లోనూ, పోయిన సారి నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌ల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఆయ‌న త‌మిళంలో నిర్మాత కూడా. అక్క‌డి వారికి అవ‌కాశాలిచ్చి, అక్క‌డ ప‌న్నులు క‌ట్టి, అక్క‌డి రైతుల‌కు త‌న లాభాల‌నుంచి డ‌బ్బుల‌ను పంచిన వ్య‌క్తి తెలుగువాడ‌ని స‌గ‌టు భార‌తిరాజాలాంటి సీనియ‌ర్ డైర‌క్ట‌ర్ల‌కు అప్పుడెందుకు గుర్తుకురాలేదు. తెలుగు న‌టుడు ఇలాంటి ప‌నులు చేస్తున్నాడ‌ని, ఆ లాభాల‌ను ఎవ‌రూ ఆశించ‌వ‌ద్ద‌ని ఎందుకు అన‌లేక‌పోయారు?  తీరా ఇప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే, త‌మిళ వాళ్లు గెల‌వాల‌నుకున్న‌ప్పుడు మాత్రం విశాల్ తెలుగువాడ‌ని గుర్తుకొచ్చాడా?

పోయిన సారి ఎన్నిక‌ల్లో ఇదే విశాల్ ను తెలుగు రెడ్డి అని రాధిక తూల‌నాడింది. ఏం ఆవిడ తెలుగు సినిమాలు చేయ‌లేదా?  తెలుగువారి ద‌గ్గ‌ర పారితోషికాన్ని తీసుకోలేదా?  అయినా సినిమా భాష‌ల వారిగా, ప్రాంతీయం వారిగా విడిపోక ముందు న‌డిగ‌ర్ సంఘంలో ద‌క్షిణాది న‌టీన‌టులంద‌రూ స‌భ్యులే. అక్క‌డ భాష‌ల‌కు ప్ర‌మేయం లేదు. ఇప్పుడు ఎవ‌రికి వారు విడిపోయిన త‌ర్వాత అక్క‌డ త‌మిళులే ఉండాల‌ని మాట్లాడుతున్నారు. తాజాగా విశాల్‌పై భాషా ప‌రంగా దాడి జ‌రుగుతున్న‌ది కూడా అందుకే. భార‌తిరాజాను తెలుగువారు ఆద‌ర్శ‌ప్రాయుడిగా గుర్తిస్తారు. ఆయ‌న సినిమాల్లోని నైపుణ్యాన్ని ఆరాధిస్తారు. అలాంటి ద‌ర్శ‌కుడు కూడా సంకుచిత మ‌న‌స్త‌త్వంతో మాట్లాడ‌టం బాధాక‌రం. క‌ళ‌ల‌కు భాషాభేదం లేద‌ని ఓవైపు చెబుతూనే, మ‌రోవైపు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాదు... అంటూ ఫిల్మ్ న‌గ‌ర్‌లో ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఆయ‌న మాట‌ల‌కు తెలుగు లెజండ‌రీ న‌టులు, చిత్ర ప‌రిశ్ర‌మ‌, 'మా' ఎలా స్పందిస్తుందో చూడాలి.

న‌డిగ‌ర్ సంఘం త‌మిళుల సొమ్మేనా?   అది క‌ళాకారులంద‌రిదీ కాదా?  అనే ప్ర‌శ్న మొద‌లైంది. స‌మాధానం ఎవ‌రు చెబుతారో, విశాల్ ఎలా స్పందిస్తారోచూడాలి. అస‌లు త‌మిళ‌నాడుకు, ద‌క్షిణాదికి ఏ మాత్రం సంబంధం లేని నాయిక‌లు ఎంతో మంది స‌భ్య‌త్వ రుసుము క‌ట్టి అక్క‌డ స‌భ్య‌త్వాన్ని తీసుకున్నారు. విశాల్‌నే అంత తేలిగ్గా తీసిపారేసిన భార‌తిరాజాలాంటివాళ్లు, ఈ నాయిక‌ల‌కు ఎలాంటి గౌర‌వాన్నిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదేమో.

More News

ఆర్కేకు-లోకేష్ కరచాలనం.. చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేయిస్తాం!

అవును మీరు వింటున్నది నిజమే.. అమరావతిలోని ఇంటి నుంచి టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబును ఖాళీ చేయిస్తామని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శపథం చేశారు.

పోకిరీ విద్యార్థుల హంగామా.. బస్సుపైన బర్త్‌డే చేస్తుండగా..!

చెన్నైలో పోకిరీ విద్యార్థులు హంగామా చేశారు. బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో వీరంగం సృష్టించారు.

లారీని ఢీకొన్న చలాకి చంటి కారు.. తృటిలో తప్పిన ప్రమాదం

జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో చంటి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వివరాల్లోకెళితే..

చంద్రబాబూ.. నేనేం మీ ‘పప్పు’లాంటోడ్ని కాదు!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నాడు వాడివేడిగా జరిగాయి. అటు అసెంబ్లీలో.. ఇటు శాసనమండలిలో వైసీపీ నేతలు వర్సెస్ టీడీపీ నేతలుగా పరిస్థితి ఏర్పడింది.

'RRR'కు నైజాంలో భారీ రేటు

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ న‌టిస్తోన్న చిత్రం `RRR`. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా..