close
Choose your channels

సీనియర్ బాలీవుడ్ నటి కన్నుమూత

Thursday, August 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీనియర్ బాలీవుడ్ నటి కన్నుమూత

ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటి విద్యా సిన్హా(71)ఈరోజు ముంబైలోని జుహూ హాస్పిటల్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ఈమె గుండె, శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.

నవంబర్ 15, 1947లో ముంబైలో జన్మించారు. 18 ఏళ్ల వయసులో మిస్ ముంబైగా గెలిచారు. పలు కమర్షియల్ యాడ్స్‌లో నటించారు. అయితే పెళ్లి తర్వాతనే సినీ రంగ ప్రవేశం చేశారు. కిరణ్ కుమార్ సరసన `రాజాకాక` చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. `రజనీగంధ` చిత్రంతో నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. తర్వాత పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు.

వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా నటించి మెప్పించారు. సల్మాన్ ఖాన్ `బాడీగార్డ్` ఈమె నటించిన చివరి చిత్రం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.