వేసవి సెలవుల్లో విక్టరీ వెంకటేష్ గురు

  • IndiaGlitz, [Saturday,February 11 2017]

తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి, తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మరొక విన్నూత్నమైన పాత్రలో కనిపించనున్నారు . సుధా కొంగర దర్శకత్వం వహించిన "గురు" చిత్రం లో బాక్సింగ్ కోచ్ పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపిస్తారు.
స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ఉండే ఈ స్పోర్ట్స్ డ్రామా ను వేసవి సెలవుల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధపడుతోంది. ఈ చిత్రం లో ని "ఏయ్ సక్కనోడా " పాట లిరికల్ వీడియో ను ఈ నెల 17 న విడుదల చేస్తున్నట్లు నిర్మాత శశికాంత్ తెలిపారు.
" సుప్రసిద్ధ దర్శకులు మణి రత్నం తో పని చేసి, మిత్ర్ సినిమా తో నేషనల్ అవార్డు దక్కించుకున్న సుధా కొంగర ఈ చిత్రాన్ని మలచిన తీరు అద్భుతం. విక్టరీ వెంకటేష్ ను ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త లుక్ లో ప్రెసెంట్ చేస్తున్నాం. మంచి ఎమోషన్స్ తో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా ఇది. ఈ వేసవి లో విడుదల చేస్తున్నాం. విడుదల తేదీ త్వరలోనే తెలుపుతాం" అని నిర్మాత శశికాంత్ తెలిపారు.
రితిక సింగ్, ముంతాజ్ సర్కార్ లు ఈ చిత్రం లో వెంకటేష్ తో పాటు ప్రధాన పాత్రలను పోషిస్తారు. రితిక సింగ్ ఇటీవలే ఉత్తమ నటి క్యాటగిరి లో నేషనల్ అవార్డు ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ముంతాజ్ సర్కార్ విషయానికి వస్తే, ఆమె సుప్రసిద్ధ మాంత్రికులు పి . సి. సర్కార్ కుమార్తె.
గురు చిత్రం ఆడియో ను మర్చి మొదటి వరం లో విడుదల చేస్తారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణ్ గతం లో "కబాలి", "భైరవా" వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు.

More News

స్టీవ్ జార్డింగ్ ను కలిసిన పవన్ కల్యాణ్

హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో స్పీచ్ కోసం బోస్టన్ చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అంతర్జాతీయ రాజకీయ వ్యూహకర్తగా పేరున్న స్టీవ్ జార్డింగ్ను కలుసుకున్నారు. శుక్రవారం తెల్లవారు జామున హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న స్టీవ్ జార్డింగ్, పవన్ ప్రత్యేకంగా కలుసుకున్నారు.

సందీప్ కిషన్ 'నగరం' రిలీజ్ డేట్

యువ కథానాయకుడు సందీప్ కిషన్, రెజీనా జంటగా ఎ.కె.ఎస్. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లోకేష్ కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంలో అశ్విన్కుమార్ సహదేవ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం 'నగరంస సైలెంట్గా విడుదలకు సిద్ధమైంంది.

తండ్రికొడుకులు నటిస్తున్నారా..

హీరో,నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ ఇజం తర్వాత తదుపరి సినిమా హీరోగా ప్రారంభం కావడానికి టైమ్ తీసుకుంటున్నాడు.

విభిన్న ప్రేమకథ గా 'గువ్వ గోరింక'

‘జ్యోతిలక్ష్మీ’ఫేమ్ సత్యదేవ్ హీరోగా,ప్రియాలాల్ హీరోయిన్గా ఆకార్ మూవీస్ పతాకంపై రామ్ గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడిని దర్శకుడిగా

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా 'వెంకటాపురం' ధియోట్రికల్ ట్రైలర్ విడుదల

గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారధ్యంలో ఐదో చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం వెంకటా పురం. ఈ చిత్రంలో హ్యాపీడేస్ లో టైసన్ క్యారెక్టర్ తో మంచి పేరు సంపాదించుకున్న రాహుల్ హీరోగా నటిస్తున్నారు.