close
Choose your channels

అతిథి పాత్ర‌లో విద్యాబాల‌న్‌

Monday, December 10, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అతిథి పాత్ర‌లో విద్యాబాల‌న్‌

హిందీలో ఘ‌న విజ‌యం సాధించిన 'పింక్' సినిమాను ఇప్పుడు త‌మిళంలో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ స్టార్ న‌టుడు అజిత్ ఇందులో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. 'ఖాకి' సినిమా ఫేమ్ హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది.

మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచారాల గురించి ఈ సినిమాలో చూపించారు. కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్ త‌మిళ రీమేక్‌లో కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంద‌ట‌.

బాలీవుడ్‌లో న‌టించిన తాప్సీ పాత్ర‌ను త‌మిళంలో ఎవ‌రు చేస్తార‌నే దానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. స్టార్ క‌మ‌ర్షియ‌ల్ హీరో అయిన అజిత్ ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంలో న‌టిస్తుండ‌టంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.