రజనీకాంత్ సినిమాలో విద్యాబాలన్....?

  • IndiaGlitz, [Tuesday,February 21 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ 2.0 శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ప్ర‌స్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ముంబైలో జ‌రుగుతుంది. 2.0 త‌ర్వాత క‌బాలి ఫేమ్ పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జనీకాంత్ త‌న తదుప‌రి సినిమా చేయ‌బోతున్నాడు. హీరో ధ‌నుష్ వండ‌ర్ బార్స్ బ్యాన‌ర్‌పై నిర్మించ‌నున్న‌ ఈ చిత్రానికి క‌బాలి డైరెక్ట‌ర్ పా రంజిత్ ద‌ర్శ‌కుడుగా వ‌ర్క్ చేయ‌నున్నాడు.

ఈ సినిమా షూటింగ్‌ను మే నుండే ప్రారంభిస్తార‌ట‌. సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ అయ్యింది. అందులో భాగంగా ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న న‌టించ‌డానికి విద్యాబాల‌న్‌ను సంప్ర‌దిస్తున్నార‌న‌టి స‌మాచారం. త్వ‌ర‌లోనే ర‌జ‌నీకాంత్ కొత్త సినిమాకు సంబంధించిన వివ‌రాలు తెలుస్తాయి. ర‌జ‌నీకాంత్ 2.0 ఈ ఏడాది దీపావళి సంద‌ర్భంగా విడుద‌ల కానుంది.