గ‌ణిత మేధావి పాత్ర‌లో విద్యాబాల‌న్‌...

  • IndiaGlitz, [Monday,September 16 2019]

సిల్క్ స్మిత జీవితాన్ని డ‌ర్టీపిక్చ‌ర్ అంటూ తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. అందులో సిల్క్ స్మిత‌గా న‌టించిన విద్యాబాల‌న్, త‌న న‌ట‌న‌తో అంద‌రినీ మెప్పించింది. తదుప‌రి 'య‌న్‌.టి.ఆర్' బ‌యోపిక్‌లో బ‌స‌వ‌తారకం పాత్ర‌లో న‌టించింది. ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన బ‌యోపిక్‌లో న‌టించ‌డానికి రెడీ అయ్యారు. ఈ బ‌యోపిక్ ఎవ‌రిదో కాదు..శ‌కుంత‌లా దేవి. హ్యుమ‌న్ కంప్యూట‌ర్‌గా చెప్పుకునే శకుంత‌లాదేవి మ‌హిళా గ‌ణిత మేధావి. ఈమె బ‌యోపిక్‌లో విద్యాబాల‌న్ న‌టించ‌నున్నారు.

ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ నేటి నుండి ప్రారంభ‌మైంది. సోనీ పిక్చ‌ర్స్ అబుందంతియా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై సినిమా నిర్మితం కానుంది. అనుమీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ మ‌ల్హోత్రా నిర్మించ‌బోయే ఈ బ‌యోపిక్ వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానుంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, ప్రోమోను ఈ ఏడాదిలో విడుద‌ల చేశారు.

ఉత్త‌రాదిలోనే కాకుండా ద‌క్షిణాదిలో కూడా విద్యాబాల‌న్ సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు, య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు చిత్రాల్లో న‌టించిన విద్యాబాల‌న్‌, త‌మిళంలో కూడా అజిత్ స‌ర‌స‌న నెర్కొండ పార్వ్యై చిత్రంలోనూ న‌టించారు. జ‌య‌ల‌లిత బ‌యోపిక్ త‌లైవిలో కూడా ఈమెను నటింప చేయాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి కానీ.. ఎందుక‌నో విద్యాబాల‌న్ త‌లైవిలో న‌టించ‌డానికి ఒప్పుకోలేదు. అయితే ఇందిరా గాంధీ జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని రూపొంద‌బోయే వెబ్ సిరీస్‌లో న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

కోడెల మృతిపై తెలంగాణ సర్కార్ విచారణ!?

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై అనేక అనుమానాలు వస్తున్న విషయం తెలిసిందే.

మ‌హేశ్ ఆఫ‌ర్‌ని తిర‌స్క‌రించిన బాలీవుడ్ బ్యూటీ

ప్ర‌స్తుతం బాలీవుడ్, సౌత్ సినిమాల మ‌ధ్య అంత‌రాలు త‌గ్గిపోతున్నాయి. అంద‌రూ క‌లిసిపోతున్నారు.

కోడెల మరణంపై కుమార్తె చెప్పిన నిజాలివీ..

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

కోడెల మరణంపై జనసేనాని రియాక్షన్ ఇదీ...

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

కోడెల మృతికి ‘ఆయనే’ కారణమా..? ఆత్మహత్య కాదా..!?

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతికి కొడుకే కారణమా..? ఆయన ఆత్మహత్య చేసుకోలేదా..?