అందుకే తారక్ అంటే ఇష్టం .. జూనియర్‌ ఎన్టీఆర్‌పై బాలీవుడ్ విలన్ ప్రశంసలు

కెరీర్ తొలినాళ్లలో విలన్‌గా నటించి తర్వాత స్టార్ హీరోలుగా ఎదిగిన వారు ఎందరో. రజనీకాంత్, చిరంజీవి, మోహన్ బాబు, శ్రీకాంత్, గోపిచంద్ ఇలా లిస్ట్ చాలానే వుంది. ఇలాంటి వారిలో ఒకరు విద్యుత్ జమ్వాల్ ఒకరు. హాలీవుడ్ రేంజ్ కటౌట్‌తో, మంచి నటనతో గుర్తింపు తెచ్చుకున్నారాయన. తెలుగులోనూ శక్తి, ఊసరవెల్లి సినిమాలు చేసిన ఆయన ఎలాంటి గాడ్ ఫాదర్‌ లేకపోయినా తన స్వయంకృషితో స్టార్‌గా ఎదిగారు. కమాండో సిరీస్ ద్వారా భారతదేశ వ్యాప్తంగా పాపులారిటీ పెంచుకున్నారు విద్యుత్.

జూలై 8న ఖుదా హాఫిజ్: చాప్టర్ 2 అగ్ని పరీక్ష విడుదల:

ఇకపోతే.. ఆయన నటించిన ఖుదా హాఫిజ్: చాప్టర్ 2 అగ్ని పరీక్ష వచ్చే నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను హైదరాబాద్ నుంచే మొదలుపెట్టింది. దీనిలో భాగంగా భాగంగా విద్యుత్, ఫరూక్‌లు తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తేశారు విద్యుత్.

హైదరాబాద్ నుంచే నా సినిమా జర్నీ:

హైదరాబాద్ నుంచే తన సినీ జీవితం మొదలైందని ముంబైలో గర్వంగా చెప్పుకుంటానన్నారు. తను నటించిన తొలి సినిమా శక్తి అని ఆ సినిమా షూట్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌తో పరిచయం ఏర్పడిందని విద్యుత్ తెలిపారు. తనను ఏమని పిలవాలో తనకు అర్థమయ్యేది కాదని .. ఆ సమయంలో ఎన్‌టీఆర్ జూనియర్ అని పిలిచివాడినని విద్యుత్ జమ్వాల్ గుర్తుచేశారు. దీంతో ఆయనే వచ్చి తారక్ అని పిలవమని చెప్పినట్లు తెలిపారు. తోటివారితో దయ, ప్రేమగా ఉండాలనే విషయాన్ని ఎన్‌టీఆర్ నుంచే నేర్చుకున్నానని విద్యుత్ చెప్పారు. తాను ఎక్కడికి వెళ్లినా ఆ విషయాలను మర్చిపోనని ఆయన వెల్లడించారు.

ఎన్టీఆర్ తనను స్టార్‌లా ట్రీట్ చేశారు:

‘శక్తి’ సినిమా నుంచే తమ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని, ‘ఊసరవెల్లి’తో అది మరింత బలపడిందని విద్యుత్ జమ్వాల్ తెలిపారు. తారక్ ఇప్పటికీ తన హీరోనేనని.. ఆయనతో కలిసి సినిమాలు చేసినప్పుడు ఎన్టీఆర్ తనని స్టార్ లా ట్రీట్ చేశాడని ఆయన గుర్తుచేసుకున్నారు. అంతేకాదు.. తన కమాండో 2 సినిమాను చూడమని ప్రమోట్ కూడా చేశాడని, అందుకే ఆయనంటే తనకెంతో ఇష్టం, గౌరవమని విద్యుత్ జమ్వాల్ పేర్కొన్నాడు.

హైదరాబాద్ రాగానే ఎన్టీఆర్‌కి ఫోన్ చేశా:

తారక్ ఒక గొప్ప డ్యాన్సర్ అని ప్రశంసించిన ఆయన.. ఎన్టీఆర్‌ను మొదట్లో కలిసినప్పుడే తాను చూసిన గొప్ప డ్యాన్సర్లలో నువ్వే బెస్ట్’’ అని చెప్పానని విద్యుత్ తెలిపారు. తామిద్దరం మంచి స్నేహితులమని, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే ఎన్టీఆర్‌కి కాల్ చేసి మాట్లాడానని ఆయన తెలిపారు. ఇక హనుమంతుడు తనకిష్టమన యాక్షన్ హీరో అని విద్యుత్ జమ్వాల్ వెల్లడించారు. ఇకపోతే.. ‘ఖుదా హాఫిజ్: చాప్టర్ 2-అగ్ని పరీక్ష’ ను ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించామని దర్శకుడు పేర్కొన్నారు. అందరూ సినిమాను చూసి తమను ఆశీర్వాదించాలని ఆయన కోరారు. జీ స్టూడియోస్, పనోరమా స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

More News

సందడిగా "చోర్ బజార్" సక్సెస్ మీట్

ఆకాష్ పూరి, గెహనా సిప్పీ హీరో హీరోయిన్లుగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన సినిమా చోర్ బజార్.

Sai Kiran : సభ్యత్వం పేరిట రూ.లక్షలు మోసం .. నిర్మాతపై ఫిర్యాదు చేసిన నువ్వేకావాలి సాయికిరణ్

నువ్వేకావాలి సినిమాలో తరుణ్, రిచాలతో పాటు సమానంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, సింగర్ సాయి కిరణ్‌ను ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు.

Janasena : భావి తరాలను కాపాడుకోవాలంటే జనసేన రావాల్సిందే .. నేనూ కార్యకర్తలా శ్రమిస్తా: నాగబాబు

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేనను పటిష్ట పరిచే పనుల్లో బిజీగా వుంటున్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు.

ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్  "ఏనుగు" కు క్లీన్ U/A

శ్రీమతి జగన్మోహని సమర్పణలో  విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్,  డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై

Kommu Konam Fish: వలలో చిక్కిన అరుదైన చేపలు.. కోటీశ్వరులైన ఇద్దరు జాలర్లు

కొంతమందికి రాత్రికి రాత్రే అదృష్టం కలిసి వస్తుంది. కొందరు జాలర్ల విషయంలో ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది.