విజయ్ ఆంటోని, అర్జున్ నటించిన 'కిల్లర్' ట్రైలర్ రేపు విడుదల..!!

  • IndiaGlitz, [Sunday,May 19 2019]

క్రేజీ హీరో విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొలైగారన్‌’. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

మర్డర్‌ మిస్టరీ, క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా లో అషిమా కథానాయికగా నటించారు.ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ తొలి వారంలో సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా ఈ చిత్రం ట్రైలర్ ని రేపు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు..ఇప్పటికే ఈ సినిమా టీజ‌ర్, పాటలు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా సినిమా పై అంచనాలను పెంచింది.. టీజర్ ని బట్టి విజ‌య్ ఆంటోని.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ పోటాపోటీగా న‌టించే చిత్ర‌ం అని తెలుస్తోంది. సైమ‌న్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు..

More News

విబేదాలు..లారెన్స్ వాకౌట్‌

రాఘ‌వ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ సినిమా 'లక్ష్మీబాంబ్‌'. త‌మిళంలో రూపొంది.. తెలుగులోకి అనువాద‌మై ఘ‌న విజ‌యం సాధించిన 'కాంచ‌న‌' సినిమాకు ఇది రీమేక్‌.

టాలీవుడ్‌లో భారీగా రెమ్యునరేషన్ తీసుకునేది ఈ భామలే!

టాలీవుడ్‌‌కు హీరోయిన్లు కొదవలేదని చెప్పుకోవచ్చు.. ఎంతోమంది వస్తుంటారు.. తమ టాలెంట్‌తో ఇండస్ట్రీని ఏలేస్తుంటారు.. మరికొందరు

బీజేపీ నుంచి కన్నా ఔట్.. త్వరలో వైసీపీలోకి!

అవును మీరు వింటున్నది నిజమే.. కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఢిల్లీ అధిష్టానం యోచిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

రెండు టైగర్స్‌తో 'మహర్షి' ని మీ ముందుకు తీసుకొచ్చా!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. మే-09న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది.

100 డేస్.. 4 షోలతో ఫుల్.. వరల్డ్ రికార్డ్ : అశ్వనీదత్ 

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. మే-09న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది.