close
Choose your channels

'బిచ్చగాడు 2' షురూ.. సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న మురుగదాస్!

Friday, July 23, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఐదేళ్ల క్రితం విడుదలైన బిచ్చగాడు చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. విజయ్ ఆంటోని నటించిన ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. విజయ్ ఆంటోని నటన, కథ, టేకింగ్ ఇలా ప్రతి ఒక్క అసం బిచ్చగాడు చిత్రంలో హైలైట్ గా నిలిచింది.

ఐదేళ్ల తర్వాత బిచ్చగాడు చిత్ర సీక్వెల్ కు రంగం సిద్ధం అయింది. బిచ్చగాడు 2 అంటూ విజయ్ ఆంటోని కొద్దిసేపటి క్రితమే సర్ ప్రైజ్ ఇచ్చాడు. బిచ్చగాడు చిత్రం శశి దర్శకత్వంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. బిచ్చగాడు 2 దర్శకుడు ఎవరు అనే సస్పెన్స్ కు జూలై 24న తెరపడనుంది.

స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్ర దర్శకుడిని జూలై 24న ఉదయం 11 గంటలకు రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ లోనే ఈ చిత్రం నిర్మించబడనుంది. బిచ్చగాడు చిత్రానికి విజయ్ ఆంటోనినే సంగీతం అందించాడు.

బిచ్చగాడు 2 చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరో త్వరలోనే తెలియనుంది. ధనవంతుడైన వ్యాపారవేత్త తన తల్లి ఆరోగ్యం కోసం కొన్ని రోజులపాటు అజ్ఞాతంగా ఉంటూ బిచ్చగాడిగా జీవిస్తాడు. ఓ సాధువు చెప్పినట్లు బిచ్చగాడిగా తన తల్లి కోసం ఆ పని చేస్తాడు. ఈ పాయింట్ తోనే బిచ్చగాడు చిత్రం తెరకెక్కి అఖండ విజయాన్ని అందుకుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.