క్యూరియాసిటీ పెంచుతున్న విజయ్ ఆంటోనీ 'హత్య' మోషన్ పోస్టర్

  • IndiaGlitz, [Saturday,July 16 2022]

తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా 'హత్య'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించనున్నారు. హీరోయిన్ రితికా సింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. లీలను ఎవరు హత్య చేశారు అనే కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుండటం ఈ వీడియోలో చూపించారు. విచారణ జరిపే సీటులో భాయ్ ఫ్రెండ్, ఫొటోగ్రాఫర్, మేనేజర్, ఏజెంట్, పొరుగు మహిళ...వీరిలో ఎవరు. వీరెవరూ కాకుండా లీల హత్యకు మరెవరైనా కారణమా అనే ప్రశ్నలతో మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. ఎవరూ ఊహించని వ్యక్తి (విజయ్ ఆంటోనీ)కి లీలను చంపాడా అనేది ఆసక్తిని కలిగిస్తోంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి మిస్టరీ తేలనుంది.

ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో మురళీ శర్మ, జాన్ విజయ్, రాదికా శరత్‌కుమార్, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు నటిస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..ఆర్‌కె సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.

More News

Janasena : తూర్పు , కోనసీమ జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర.. పవన్‌కు అభిమానుల ఘనస్వాగతం

ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘‘కౌలు రైతు భరోసా యాత్ర’’ను చేపట్టిన సంగతి తెలిసిందే.

Lal Singh Chaddha: చిరంజీవి కోసం ‘‘లాల్ సింగ్ చద్దా’’ స్పెషల్ ప్రివ్యూ.. అమీర్‌తో పాటు స్పెషల్ గెస్ట్‌లు

తన చిత్రాలతో పాటు తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటారు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీ కష్టాల్లో వున్నప్పుడు తన వంతు సాయం తప్పకుండా చేస్తారు. ధియేటర్ల ఇబ్బందులు

GoodMorningCMSir : పందుల్ని డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేదా.. స్విమ్మింగ్ పూల్స్‌లా రోడ్లు : జగన్‌పై పవన్ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్ల పరిస్ధితిపై మరోసారి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్.

GoodMorningCMSir : మీ వూళ్లో రోడ్ల పరిస్ధితేంటీ .. ఫోటోలు, వీడియోలు తీయండి : ప్రజలకు పవన్ విజ్ఞప్తి

రోడ్ల మరమ్మత్తులపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గురువారం ఈ మేరకు ఈయన ఓ ప్రకటన విడుదల చేశారు.

నా ఫిల్మోగ్రఫీలో 'మా నీళ్ల ట్యాంక్' ఉంటుందని గర్వంగా చెప్పగలను: సుశాంత్

ఇప్పటి వరకు ZEE5 ప్రేక్షకులకు అద్భుతమైన వెబ్ సిరీస్ లను అందిస్తుంది . పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’,