నవంబర్ 30న రిలీజ్ అవుతోన్న'ఇంద్రసేన'

  • IndiaGlitz, [Monday,November 06 2017]

వైవిధ్యమైన సినిమాలతో, వరుస కమర్షియల్ సక్సెస్ లతో తనకంటూ ఓ మార్క్ ను సృష్టించుకున్న హీరో విజయ్ ఆంటోని తాజాగా నటిస్తోన్న చిత్రం 'ఇంద్రసేన'. ఆర్.స్డూడియోస్, విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై జి.శ్రీనివాసన్ దర్శ‌క‌త్వంలో రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని 'ఇంద్రసేన' చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా ఏక కాలంలో న‌వంబ‌ర్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా...

నిర్మాత‌లు మాట్లాడుతూ - ''డిఫ‌రెంట్ చిత్రాల‌తో తెలుగులో త‌నకంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న విజ‌య్ ఆంటోనికి సినిమాల‌కు తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. గ‌తంలో కూడా నకిలీ, డా.స‌లీంల‌తో మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్న విజ‌య్ ఆంటోని 'బిచ్చ‌గాడు'తో సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. త‌ర్వాత భేతాళుడు, యెమ‌న్ చిత్రాల‌తో క‌మ‌ర్షియ‌ల్ హీరోగా స‌క్సెస్ సాధించారు. బిచ్చ‌గాడు చిత్రంలోని మ‌ద‌ర్ సెంటిమెంట్‌కు త‌న అద్భుత‌మైన న‌ట‌న‌ను తోడు చేసి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ వ‌ర్షాన్ని కురిపించిన విజ‌య్ ఆంటోని 'ఇంద్ర‌సేన' చిత్రంలో బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో ఆక్టుకోవ‌డానికి సిద్ధ‌మైయ్యారు విజ‌య్ ఆంటోని. బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో పాటు హై ఎమోష‌న్స్ కాంబినేష‌న్స్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అల్రెడి విడుద‌లైన ఈ సినిమా పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా కూడా అద్భుతంగా వ‌చ్చింది. అంచ‌నాల‌ను అందుకునేలా సినిమా ఉంటుద‌న‌డంలో సందేహం లేదు. నవంబ‌ర్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు,త మిళంలో సినిమా గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి, సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, నిర్మాతలు: రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని, దర్శకత్వం: జి.శ్రీనివాసన్.

More News

ఐశ్వర్య షూటింగ్ లో ప్రమాదం...

ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రస్తుతం ఫన్నెఖాన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది.

శివాజీ రాజా ముఖ్య పాత్రలో 'అమ్మాయిలంతే..అదో టైపు'

అమ్మాయిల లొని  ఎమోష‌న‌ల్ యాంగిల్‌ను,  తండ్రి తనయల రిలేషన్ హైలెట్ చెస్తూ దర్శ కుడు కృష్ణమ్ రూపొందిస్తొన్న చిత్రం 'అమ్మాయిలంతే ..అదోటైపు'.

నవంబ‌ర్ 17న 'దేవిశ్రీ ప్ర‌సాద్‌' విడుద‌ల‌

యశ్వంత్ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో,  ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న‌ చిత్రం దేవిశ్రీప్రసాద్. పూజా రామచంద్రన్, భూపాల్, ధ‌న‌రాజ్‌, మనోజ్ నందన్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి

భరత్ ఆర్ట్ ప్రొడక్షన్స్..  ప్రొడక్షన్ నెంబర్ వన్ గా బండారు దానయ్య కవి దర్శకత్వంలో కదిరి శేఖర్ బాబు నిర్మిస్తున్న చిత్రం 'డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి'.

కార్తితో అఖిల్ హీరోయిన్‌...

హీరో కార్తి ఇప్పుడు వ‌రు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో కార్తి ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సినిమా సాగుతుంది.