చిరంజీవి టైటిల్ తో విజయ్ ఆంటోని...

  • IndiaGlitz, [Sunday,September 03 2017]

సాధార‌ణంగా చిరంజీవి సినిమాకు సంబంధించిన పాట‌ల‌ను, టైటిల్స్‌ను ఈ త‌రం మెగా హీరోలు త‌మ సినిమాల్లో వాడుకుంటూ ఉన్నారు. అయితే తమిళ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, నిర్మాత‌, నటుడు విజ‌య్ ఆంటోని చిరంజీవి సినిమా టైటిల్‌ను త‌న సినిమాకు పెట్టుకున్నాడు. చిరంజీవి కెరీర్‌లో బెస్ట్ హిట్ మూవీగా నిలిచిన ఇంద్ర సినిమా అంద‌రికీ గుర్తుండే ఉంటుంది.

ఇప్పుడు ఇంద్ర‌సేన అనే టైటిల్‌తో విజ‌య్ ఆంటోని మ‌న ముందుకు రానున్నారు. త‌మిళంలో పొలిటికల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి 5వ తేదిన విడుద‌ల చేస్తార‌ట‌. జి.శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమాను విజ‌య్ ఆంటోని నిర్మాణ సంస్థ‌తో పాటు రాధిక శ‌ర‌త్‌కుమార్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంద‌ట‌.